Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dropped Catch: ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన ముంబై ఇండియన్స్ (MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ లో ఉత్కంఠభరిత ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ కీలక సమయంలో తిలక్ వర్మ, నమన్ ధీర్ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఒక్క క్యాచ్ మిస్ ముంబై ఇండియన్స్‌కు మ్యాచ్‌తో పాటు ప్లేఆఫ్స్ అవకాశాలను కూడా దూరం చేసింది. దీనితో అఫీషియల్ గా ఐపీఎల్ 2026 లో ప్లేఆఫ్స్ చేరాక ముందే ముంబై ఇండియన్స్ నిష్క్రమించినట్లైంది.
167 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేస్తున్న RCB జట్టు ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది. అయితే కృనాల్ పాండ్యా ఒంటరి పోరాటంతో జట్టును విజయ దిశగా నడిపించాడు. 46 బంతుల్లో ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 73 పరుగులు చేసిన కృనాల్ మలుపుతిప్పాడు. మ్యాచ్‌లో 18వ ఓవర్ రెండో బంతికి ఓ కీలక ఘటన చోటు చేసుకుంది. అల్లా గజన్ఫర్ వేసిన బంతిని కృనాల్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ దగ్గర నమన్ ధీర్ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోతున్న సమయంలో బంతిని మైదానంలో ఉన్న తిలక్ వర్మ వైపు విసిరేశాడు. కానీ తిలక్ బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. దీంతో సులభంగా ముగియాల్సిన క్యాచ్ నేలపాలైంది.
Also Read
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
అంతే.. ఈ ఘటనతో నమన్ ధీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తిలక్ వర్మతో మైదానంలోనే వాగ్వాదానికి దిగాడు. తిలక్ మాత్రం నమన్ బౌండరీ రోప్‌ను తాకడాన్ని వాదించినట్లు కనిపించింది. అయితే థర్డ్ అంపైర్ రిప్లేలో నమన్ ధీర్ క్లియర్‌గా రోప్‌ను తాకలేదని తేలింది. దీంతో ఈ క్యాచ్ మిస్ పూర్తిగా ముంబై ఫీల్డర్ల మధ్య జరిగిన కమ్యూనికేషన్ లోపంగా మారింది. ఈ లైఫ్‌తో మరింత మరో ఛాన్స్ దొరకడంతో కృనాల్ పాండ్యా అదే ఓవర్లో మరో రెండు భారీ సిక్సర్లు బాది మ్యాచ్ ను ముంబై చేతుల నుంచి లాగేసుకున్నాడు. చివరి బంతి వరకు సాగిన థ్రిల్లర్ లో RCB చివరి బంతికి రెండు పరుగులు తీసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
ఇక ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ అధికారికంగా ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. చివరి ఓవర్లో 15 పరుగులు కాపాడాల్సిన బాధ్యత రాజ్ అంగద్ బావాకు అప్పగించినా.. అతడు ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. దీంతో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై మరోసారి టైటిల్ లేకుండానే సీజన్ ముగించుకుంది. 2020 తర్వాత ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది ముంబై ఇండియన్స్.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?