NTV Telugu Site icon

Drone Cameras: పక్షులు అనుకున్నారు కదా.. అవి డ్రోన్ కెమెరాలు బాసు..

Drones

Drones

Drone Cameras At Ganesh Immersion: నేడు హైదరాబాద్ మహానగరంలో దేదీవ్యమానంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరుగుతోంది.. హైదరాబాద్ మహానగరంలో అనేక రోడ్లు జన సంద్రంతో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెక్రటేరియట్, తెలుగు తల్లి రోడ్డులో ఇసుక వేస్తే రాలనంత జనాలు ఉన్నారు. ఇక మరోవైపు మీడియా కూడా గణేష్ నిమజ్జనాన్ని కవర్ చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అందరిని అబ్బురపరిచేలా ఓ దృశ్యం ఆవిష్కృతమైంది. ఎవరైనా సరే మొదటిసారిగా ఆ దృశ్యాన్ని చూస్తే అక్కడ ఖచ్చితంగా కొన్ని పక్షులు ఉన్నాయని ఇట్లే భ్రమపడతారు. అయితే వాటిని నిశితంగా పరిశీలిస్తే అక్కడ ఉన్నవి డ్రోన్ కెమెరాలని తెలిసిపోతుంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Bihar Crime: 14 ఏళ్ల బాలికను గన్‌తో బెదిరించి, కారులో తిప్పుతూ అత్యాచారం..

మరోవైపు హైదరాబాద్ లో ఉన్న 70 అడుగుల హైదరాబాద్ మహా వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు భక్తులు, అధికారులు, కమిటీ సభ్యులు, పోలీసులు కష్టపడుతున్నారు. మరోవైపు బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం మరోసారి రికార్డు ధర పలికింది. ఈసారి లడ్డూను కొలను శంకర్ రెడ్డి 30 లక్షల వెయ్యి రూపాయలకు దక్కించుకున్నారు.