Site icon NTV Telugu

Father Shocking Decision : కొడుకు పెళ్లి చేసి అప్పులపాలైన తండ్రి.. షాకింగ్ డెసిషన్

Son Marriage

Son Marriage

Father Shocking Decision : కుమారుడి పెళ్లి కారణంగా అప్పులపాలైన తండ్రి.. అప్పు తీర్చేందుకు షాకిచ్చాడు. తాను తీసుకున్న నిర్ణయంతో అతను నేరుగా జైలుకు పంపబడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని బంగంగా ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. నిందితుడి పేరు రాజేంద్ర పండిట్, వృత్తి రీత్యా డ్రైవర్. రాజేంద్ర కొడుకు పెళ్లి ఇటీవలే జరిగింది. ఈ పెళ్లి వల్ల అప్పుల పాలయ్యాడు. ఈ అప్పు తీర్చేందుకు యజమాని నుంచి రూ.4 లక్షలు దోచుకున్నాడు. అయితే సీసీటీవీలో అతడు దొంగతనం చేస్తున్న దృశ్యాలు నమోదు కావడంతో అతడు పట్టుబడ్డాడు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Read Also: Chennai: అవినీతి రాణి.. మహిళా ఇన్‌స్పెక్టర్ కహానీ..

రాజేంద్ర పండిట్ తన కుమారుడికి ఫిబ్రవరి నెలలో వివాహం చేశాడు. దీంతో నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పు తీర్చే మార్గం కనిపించక చాలా మదన పడ్డాడు. చేసేదేంలేక ఈ అప్పు తీర్చేందుకు యజమాని నుంచి డబ్బులు దోచుకున్నాడు. యజమాని తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.4 లక్షలు విత్‌డ్రా చేసి కారు ట్రంక్‌లో ఉంచాడు. ఈ డబ్బును రాజేంద్ర సమయం చూసి దొంగిలించాడు.

Read Also: Aishwarya Rajinikanth: ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం.. దొరికిన దొంగలు..

కారులో డబ్బులు మాయమైనట్లు గ్రహించిన యజమాని రాజేంద్రను డబ్బు మాయమైన విషయాన్ని అడిగాడు. అయితే ఆ డబ్బుపై తనకు ఏమాత్రం అవగాహన లేదని రాజేంద్ర అన్నారు. దీంతో యజమాని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చోరీపై ఫిర్యాదు అందడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు రాజేంద్ర పండిట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version