Site icon NTV Telugu

Alcohol: మందుబాబులు జాగ్రత్త.. మీలో ఈ 61 రోగాలు ఉండొచ్చు..

Alcohol

Alcohol

మారుతున్న జీవనశైలిలో మద్యం తాగడం బాగా అధికమవుతోంది. మద్యం తాగేవారు రకరకాల సాకులు చెబుతూ.. తమను తాము సమర్థించుకుంటారు. కానీ తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ పాపులేషన్‌ హెల్త్‌, పెకింగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు సుదీర్ఘకాలం సుమారు 5 లక్షల మంది మద్యం బాధితులపై పరిశోధనలు చేసి విస్తుపోయే నిజాలను వెల్లడించారు. మద్యం 28 రోగాలకు కారణమవుతుందని గతంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్ధారించగా.. ప్రత్యక్షంగా 61 రోగాలకు, పరోక్షంగా 206 వ్యాధులకు కారణమవుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది.

Also Read: Taapsee Pannu: బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ…

మద్యం కొంత తాగినా.. ఎక్కువ తాగినా శరీరంలోని అన్ని అవయవాలపై దాని ప్రభావం పడుతుందని తేల్చి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా తాగుడు వల్ల ఏటా 30 లక్షల మంది చనిపోతున్నారని, కోట్ల మంది అంగవైకల్యానికి గురవుతున్నారని తాజా ప్రకటనలో వెల్లడైంది. ఈ తాజా అధ్యయనం నేచర్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. మద్యం తాగే వివిధ వయసులకు చెందిన 5,12,724 మందిపై చైనాలో అయిదేళ్లపాటు రీసెర్చ్ చేశారు. ఆసుపత్రుల్లో చేరిన సుమారు లక్ష మందికి పైగా మద్యం బాధితుల ఆరోగ్య సమస్యలను ఈ బృందం పరిశీలించింది. వారి జీవనశైలి, ప్రవర్తన, మద్యం అలవాటు తీరును సమగ్రంగా తెలుసుకున్నారు.

Also Read: Adipurush V/s Brahmastra: ‘బ్రహ్మాస్త్ర’ రికార్డును బ్రేక్ చేసిన ‘ఆదిపురుష్’

చికిత్స, వివిధ అవయవాలపై చూపిన దుష్ప్రభావం తదితర అంశాలను ఈ బృందం విశ్లేషించింది. క్రమం తప్పకుండా మద్యం తాగేవారిని, అప్పుడప్పుడు తాగేవారిని గుర్తించి అనారోగ్య పరిస్థితులపై అధ్యయనం చేశారు. సుమారు 12 ఏళ్ల ఆసుపత్రి రికార్డులను పరిశీలించిన తర్వాత ఓ అంచనాకు వచ్చారు. జన్యు విశ్లేషణ కూడా చేశారు. మద్యం తాగేవారు 35 ఏళ్ల నుంచి 84 ఏళ్ల లోపు ఆసుపత్రిలో చేరడమో.. మరణించడమో జరిగిందని ఈ తాజా నివేదికలో వెల్లడైంది.

Also Read: Hijab: పరీక్షకు వచ్చిన స్టూడెంట్స్.. హిజాబ్ తొలగించాలన్న కాలేజీ యాజమాన్యం

మద్యం తాగేవారిలో రోగ నిరోధక శక్తి బాగా తగ్గుతుంది.. బీపీ పెరిగిపోతుంది.. గుండెవాపు సహా ఇతర సమస్యలు గుండెపోటుకు కారణమవుతున్నాయి. కడుపులో ఇన్‌ఫెక్షన్లు రావడంతో అల్సర్లు ఏర్పడుతున్నాయి.. న్యుమోనియా సహా పలు జబ్బులు వస్తుంటాయి అని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అనేక క్యాన్సర్లకూ అవకాశం ఉంది. మెదడు సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. మతిమరుపు వ్యాధి కూడా వస్తుంది. మద్యం తాగేవారు ఒక్కోసారి కోమాలోకి వెళ్లిపోతారు అని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గతంలో పరిశోధనలు పశ్చిమదేశాల ప్రజలపై జరగ్గా.. తాజా పరిశోధన ఆసియాఖండ ప్రజలపై చేశారు. జన్యుపరమైన విశ్లేషణ చేసి మద్యం ప్రభావాన్ని నిర్ధారించారు.

Exit mobile version