Taapsee Pannu: బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో మంది హీరోయిన్స్ తెలుగు సినిమాలలో అలరించి హీరోయిన్స్ గా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి హీరోయిన్ లలో తాప్సీ కూడా ఒకరు .మంచు మనోజ్ నటించిన ఝమ్మంది నాదం సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది తాప్సీ. తొలి సినిమా తోనే తన నటనతో మరియు గ్లామర్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత రవితేజతో వరుసగా రెండు సినిమా ల్లో నటించింది. ప్రభాస్ తో చేసిన మిస్టర్ ఫర్ఫెక్ట్ తో మంచి హిట్ ను అందుకుంది. తెలుగులో అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ కు వెళ్ళింది.అక్కడ పలు సినిమా అవకాశాలు అందుకున్న ఈ అమ్మడు బాగానే విజయం సాధించింది.హిందీలో తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను కూడా సొంతం చేసుకుంది. అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అందరిని బాగా మెప్పించింది.
అలాగే స్టార్ హీరోయిన్ అయిన కంగనా రనౌత్ తో మాటల యుద్ధం కూడా జరిగింది.. అలా బాలీవుడ్ లో తాప్సీ కూడా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ అక్కడక్కడ సౌత్ సినిమాలు కూడా చేస్తూ బాగానే ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తాప్సీ బాలీవుడ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్ బాలీవుడ్ పై పలు ఆరోపణలు కూడా చేసింది ఈ ఆరోపణల పై స్పందిస్తూ తాప్సీ కూడా బాలీవుడ్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది . ఒక సినిమా లో ఏ ఏ పాత్రలకు ఎవరిని తీసుకోవాలో కొంతమంది నటీనటులు డిసైడ్ చేస్తారని చెప్పుకొచ్చింది ఈ భామ.టాలెంట్ ఉన్నవాళ్ళు, క్యారెక్టర్ కు సూట్ అయ్యేవాళ్ళను అయితే కాకుండా.తమ స్నేహితులను అలాగే ఏజెన్సీ వాళ్ళను రిఫర్ చేస్తూ ఉంటారు అని చెప్పుకొచ్చింది. హిందీలో ఫేవరిటిజం ఎక్కువగా ఉంటాయని సంగతి తెలిసిందే..బాలీవుడ్ లో అవకాశాలు కోసం తిరుగుతున్న వారికీ అంతగా రావని తెలిపింది తాప్సీ.
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
తాజావార్తలు
-
AB de Villiers: “కోహ్లీ ఓవర్కాన్ఫిడెన్స్, అహంకారిలా కనిపించాడు”.. విరాట్ శైలిపై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
-
Peddireddy Ramachandra Reddy: పుంగనూరు మున్సిపల్ ఎన్నికలకు పెద్దిరెడ్డి దూరం.. ప్రజలే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు!
-
Diwali Bonus: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ ఉద్యోగులకు రూ.13,816 దీపావళి బోనస్ ప్రకటన..
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
-
Municipal Elections 2026: మున్సిపల్ కార్యాలయం ముందు వైసీపీ అభ్యర్థి నిరసన.. నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎంకు అభ్యర్థన!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!