NTV Telugu Site icon

Kayadu Lohar : వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న డ్రాగన్ బ్యూటీ

Kayadu

Kayadu

హీరోయిన్స్ నిఫేమస్ చేసేందుకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్టున్నాడు ప్రదీప్ రంగనాథన్. లవ్ టుడేతో ఇతడే సడెన్ స్టార్ అయ్యాడు అనుకుంటే యంగ్ బ్యూటీ ఇవానాను కూడా ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మార్చి ఆమెను సెన్సేషనల్ హీరోయిన్ చేసేశాడు. ఇప్పుడు అమ్మడు అటు తమిళంలో ఇటు తెలుగులో మంచి ప్రాజెక్టులు బ్యాగ్‌లో వేసుకుంటుంది. ఇప్పుడు డ్రాగన్ తో మరో బ్యూటీకి లైఫ్ ఇచ్చాడు జూనియర్ ధనుష్. ఆమె పేరే కయ్యదు లోహార్. డ్రాగన్‌తో సౌత్ ఇండస్ట్రీ దృష్టిని ఎట్రాక్ట్ చేస్తోంది నయా సోయగం కయ్యదు లోహార్.

Also Read : Zee Telugu : జీ తెలుగు అందిస్తున్న త్రిపుల్ ధమాకా ఎంటర్టైన్మెంట్..

అనుపమ పరమేశ్వరన్ కన్నా ఈమె స్క్రీన్ ప్రజెన్స్ తో ఫిదా అయిపోతున్నారు మూవీ లవర్స్. అంతకు ముందు అరడజను సినిమాలు చేసినా ఇంత ఫేమ్ చూడలేదు అమ్మడు. మలయాళంతో పాటు తెలుగులో కూడా శ్రీ విష్ణుతో అల్లూరిలో కనిపించింది కానీ అప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం అసలు ఎలారా ఇంత అందాన్ని మిస్సయ్యామంటున్నారు. ఎక్కడా చూసినా ఈ బ్యూటీ ప్రస్తావనే. కయ్యదు లోహార్‌కు అందం, యాక్టింగే కాదు అంతకు మించి తెలివితేటలు కూడా ఎక్కువే. మార్కెటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సెల్ఫ్ పీఆర్ ఎలా చేసుకోవడం అమ్మడికి తెలిసినట్లు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్లకు తెలియదు. ‘ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్’ అంటూ కొత్త భామలకు ఐడియాలు ఇస్తోంది. ఈ అస్సామీ గర్ల్ కయ్యదు లోహర్ చేతిలో ప్రజెంట్ ఇదయం మురళి ప్రాజెక్టు ఉంది. అలాగే తెలుగులో విశ్వక్ సేన్ ఫంకీలోను నటిస్తుంది. రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ప్లానింగ్ చేస్తోంది కయ్యడు లోహర్.