NTV Telugu Site icon

Film Chamber Committee: ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధిగా మంత్రి

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Film Chamber Committee Invited Komatireddy Venkat Reddy: తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో దాదాపు 70 మంది కమిటీ సభ్యులు కలిసి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈ రోజు కలిశారు. హీరో కిరణ్, జేవియర్, స్నిగ్ధ రెడ్డి, అక్సా ఖాన్, ఫైట్ మాస్టర్ రవి, రమేష్ నాయుడు, కాచం సత్యనారాయణ, అశోక్ కుమార్, నరసింహారావు, శ్రీనివాస్ గౌడ్, అల్లా బక్ష వెంకటేష్ గౌడ్ తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.

Read Also: Nimmala Ramanaidu: జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదు..

ఈ కార్యక్రమంలో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. ఇటీవల తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. మంత్రి మా ఆహ్వానాన్ని మన్నించి ప్రమాణ స్వీకార మహోత్సవానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారని, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో 16,000 మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో చాలామంది సభ్యులకు నివాస స్థలాలు లేవని, ఇల్లు లేని సినీ కార్మికులకు ఇల్లు మంజూరు చేయించాలని మంత్రిని కోరడం జరిగిందని తెలిపారు.

Read Also: Pakistan: రెండు సిరీస్‭లకు కెప్టెన్ లేకుండానే జట్టు ప్రకటన..

అలాగే సినీ పరిశ్రమ సమస్యల గురించి వివరించడం జరిగిందని, సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే సినీ పరిశ్రమలో 24 క్రాఫ్ట్ టెక్నీషియన్స్ అందరికీ, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు మంత్రి సహాయ సహకారాలు, సపోర్ట్ ఉండాలని కోరడం జరిగిందన్నారు.

Show comments