Site icon NTV Telugu

Srushti Test Tube Baby Centre: 5రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత.. జైలు నుంచి తరలించిన పోలీసులు

Dr Namratha

Dr Namratha

సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో ఏ1 నిందితురాలు డాక్టర్ నమ్రత ను కస్టడీలోకి తీసుకున్నారు గోపాలపురం పోలీసులు. సికింద్రాబాద్ కోర్టు 5రోజుల కస్టడీకి అనుమతించింది. చంచల్ గూడా జైలు నుంచి ఏ1 నమ్రత ను కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు. ఈనెల 5 వరకు డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీలోనే ఉండనుంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ విశాఖపట్నం మేనేజర్ కల్యాణి అచ్చయమ్మ వ్యవహారాలపై విచారించనున్నారు పోలీసులు.

Also Read:Karnataka: నెల జీతం 15 వేలు.. మాజీ అటెండర్ ఇంట్లో 30 కోట్ల ఆస్తులు బట్టబయలు!

డాక్టర్ నమ్రత, కల్యాణి అచ్చయమ్మలు కలిసి సరోగసిలో వచ్చే డబ్బులను వాటాలు పంచుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గోపాలపురం పోలీసులకు బాధితుల నుంచి వరుస ఫిర్యాదులు వచ్చాయి. సరోగసితో పిల్లలు పుడతారంటూ చాలామంది దంపతులను మోసం చేసింది సృష్టి డాక్టర్ నమ్రత. చైల్డ్ ట్రాఫికింగ్ అంశాలపై గోపాలపురం పోలీసులు విచారించనున్నారు.

Exit mobile version