Site icon NTV Telugu

Madhusudan : ఇది కేవలం కుట్రపూరిత రాజకీయం

Madhusudan

Madhusudan

జడ్చర్ల బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ డా. మధుసూదన్ నిరాశతో శంషాబాద్ లోని తన నివాసంలో విలేకరులు సమావేశాన్ని నిర్వహించారు. తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేసుకొని చాలా బాధపడ్డారు. గతంలో ఎన్నడు లేని విధంగా బీజేపీ పార్టీ నుంచి కూడా గుర్తింపు లేని వ్యక్తులకు టికెట్ ఇవ్వడం ఎంతో బాధాకరంగా ఉందని ఆయన దిగమింగుకొని పార్టీలోనే కొనసాగి రెబల్‌గా నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలిపారు. ఇది కేవలం కుట్రపూరిత రాజకీయంగా అభివర్ణిస్తూ కేంద్రంలో ఉన్న పెద్ద నేతలు గ్రహించవలసిందిగా ఆయన గుర్తు చేశారు.

బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు కేంద్రం అనువైన వారికి కాకుండా రాష్ట్రంలో పలుకుబడి లేని పారాషూట్ తో అప్పటికప్పుడు వాలిపోయిన వ్యక్తులకి గుర్తింపు లేని ప్రజాధరణ లేని నాయకులని ఈటల రాజేందర్ ఆదరించడం సబబు కాదని ఆయన బాధపడ్డారు. కేవలం కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఇద్దరు కలిసి పార్టీలో క్యాడర్ జనాధరణ లేని ఎలాంటి సుమిచితం లేని వ్యక్తులని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నుకోవడం వారి ఇస్తారాజ్యంగా నాయకులని ఎన్నుకోవడం వల్ల బీజేపీకి ఉన్న ప్రజాధరణ కోల్పోవడమే కాకుండా రానున్న కాలంలో రాష్ట్రంలో బీజేపీ కనుమరుగయ్యే అవకాశం కూడా ఉందని ఆయన కేంద్ర నాయకులకి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో సీట్ల కేటాయింపు కేవలం ఒక బూటకంగా మారిందని అందులో 119 అభ్యర్థుల కేటాయింపులో అలసత్వం లోనవుతుందని ఆయన నామినేషన్ వేయడానికి ప్రధాన కారణంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. అనుభవం లేని వ్యక్తులకు సీట్ల కేటాయింపులో బాధ్యతలు అప్పజెప్పడం వల్ల బీజేపీ రాష్ట్రంలో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారి అవకాశాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి అవకాశం లేని స్థానాల్లో కేవలం బండి సంజయ్ మాత్రమే ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించి పార్టీలోకి తీసుకొని ఏకధాటిపై ప్రజల్లో మంచి గుర్తింపు తీసుకువచ్చినట్టు గుర్తు చేశారు.

Exit mobile version