బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో అధికార టీఆర్ఎస్ ఓర్వలేక పోతుందన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె. లక్ష్మణ్. ప్రజా సంగ్రామ యాత్ర ప్రగతిభవన్ లో ప్రకంపనలు సృష్టిస్తుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు మోకాళ్ళ యాత్ర చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేరన్నారు లక్ష్మణ్.
వెనుకబడిన పాలమూరు ప్రజలను టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం దగా చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24గంటల ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నామని తెరాస నేతలు పదే పదే చెబుతున్నారు. ప్రజా సంగ్రామ యాత్రపై కేటీఆర్ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. తెరాస పడవ మునిగిపోతుందనే భయంతో.. కేటీఆర్ లేఖ రాశారు.
Read Also:Suma Kanakala: ‘జయమ్మ పంచాయితీ’ వాయిదా పడింది!
పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్తు కోతలు సరికాదు. కేసీఆర్ నిజాం తరహా పాలనను అంతమొందించడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారన్నారు. బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్-టీఆర్ఎస్-మజ్లీస్ ఒక్కటే. ప్రశాంత్ కిషోర్ ప్యాకేజీ కాంగ్రెస్-టీఆర్ఎస్ ను కలిపేందుకే అని లక్ష్మణ్ ఆరోపించారు. బండి సంజయ్ పాదయాత్ర టీఆర్ఎస్ పతనానికి నాంది అన్నారు. తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కోరుకుంటున్నారు. ప్రభుత్వానికి ఏ ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదు. ప్రాజెక్టుల పేరుతో దండుకోవాలనేదే ప్రభుత్వ ధ్యాసగా కనిపిస్తోందన్నారు లక్ష్మణ్.
