సమాజానికి వైద్యులు అందించే సేవలను పురస్కరించుకుంటూ డాక్టర్ కేర్ హోమియోపతి – కరీంనగర్‌లో “థాంక్యూ డాక్టర్” కార్యక్రమం జరిగింది. మార్చి 19వ తేదీన ఇండియాలోనే అతిపెద్ద హోమియోపతి క్లినిక్‌లలో ఒకటైన డాక్టర్ కేర్ హోమియోపతి, ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడంలో వైద్యులు అందించే సేవలను సత్కరించేందుకు “థాంక్యూ డాక్టర్” కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, డాక్టర్ కేర్ హోమియోపతి వైద్య బృందం ప్రపంచంలోని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై అవగాహన కల్పిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Read Also: IPL 2024: బెంగళూరు మ్యాచ్‌లకు నీటి కష్టాలు.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఇక, డాక్టర్ కేర్ హోమియోపతి వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ.ఎం. రెడ్డి గారు ప్రపంచ గతం, వర్తమానం మరియు భవిష్యత్తు ఆరోగ్య పరిస్థితులను పోల్చుతూ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. “తరతరాలు గడిచేకొద్దీ ఆరోగ్య పరిస్థితులు క్షీణిస్తున్నాయి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మరియు అధిక మందుల వినియోగం నేటి తరాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. అనవసరమైన పరిస్థితుల్లో మందులు వాడితే ఆరోగ్య పరిస్థితి మరింత దెబ్బతింటుంది” అని డాక్టర్ ఎ.ఎం. రెడ్డి గారు అన్నారు. దీనితో పాటు మెరుగైన ప్రపంచం కోసం జీరో మెడికల్ సిస్టమ్ (ZMS)ని ఎన్ను కోవడం చాలా
మెరుగైన పద్ధతి అన్నారు.
Read Also: Yarlagadda VenkatRao: యర్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ న్యాయవాది కేవీ రమణ..
అయితే, డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యుల బృందం మీడియాతో మాట్లాడుతూ నేటి ప్రపంచంలో హోమియోపతి ప్రాముఖ్యతను ప్రస్తావించారు. పాటలు మరియు నృత్య ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమైంది, ఇది ప్రేక్షకులను చాలా అలరించింది. జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సేకరించిన సమాచారంతో హాజరైనవారు చాలా సంతోషపడ్డారు. ఈ సందర్భంగా కోలుకున్న కొద్ది మంది రోగులు మాట్లాడుతూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరిచినందుకు డాక్టర్ కేర్ హోమియోపతి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వివిధ రోగులు వారి రికవరీ కథనాలను మరియు వారి జీవితాలు ఎలా పూర్తిగా మారాయో అన్న అనుభవాలను పంచుకున్నారు.