NTV Telugu Site icon

Double ismart: డబుల్ ఇస్మార్ట్ నైజాం రైట్స్ వరంగల్ శ్రీను చేతికి..?

Untitled Design (13)

Untitled Design (13)

డబుల్ ఇస్మార్ట్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో రానున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అదే లెక్కన ఎన్నో వివాదాలు ఉన్నాయి. “ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది” అన్న చందంగా ఉంది డబుల్ ఇస్మార్ట్ పరిస్థితి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ హీరోగా వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీ డిసాస్టర్ లలో ఒకటిగా నిలిచి రికార్డు నమోదు చేసింది.

 

ఇప్పుడు పూరి జగన్నాధ్ కు లైగర్ కష్టాలతో పాటు నష్టాలు మెడకు చుట్టుకున్నాయి. లైగర్ నైజాం థియేట్రికల్ రైట్స్ భారీ రేట్ పెట్టి కొనుగోలు చేసి వరంగల్ శ్రీను డిస్ట్రిబ్యూషన్ చేసాడు. ఎగ్జిబిటర్లకు భారీ రేట్లుకు అమ్మకాలు చేశాడు వరంగల్ శ్రీను. తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఫ్లాప్ అవడంతో వివాదం రేగింది. ఎగ్జిబిటర్లు తమకు నష్టపరిహారం చెల్లించవలసిందిగా వరంగల్ శ్రీను పై ఒత్తడి చేస్తే తానే ఎక్కువ నష్టపోయాను ఏమి చేయలేనని వరంగల్ శ్రీను చేతులెత్తేశాడు. దీంతో ఎగ్జిబిటర్లు పూరి జగన్నాధ్ ఆఫీస్ ను చుట్టూ ముట్టడంతో నష్ట పరిహారం చేస్తానని లెటర్స్ ఇచ్చాడు.

కాగా ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ నేపథ్యంలో వరంగల్ శ్రీను, లైగర్ ఎగ్జిబిటర్లు గేమ్ లోకి వచ్చారు, లైగర్ తో తాము తీవ్రంగా నష్టపోయాం, డబుల్ ఇస్మార్ట్ తమకే ఇవ్వాలని పంచాయతి పెట్టారు. వాదోపవాదాలు, సమాలోచనలు జరిగిన తర్వాత డబుల్ ఇస్మార్ట్ నైజాం హక్కులు వరంగల్ శ్రీను చేతికి వెళ్ళాయి. ఇప్పటికే నైజాం హక్కులు కొనుగోలు చేసిన నిరంజన్ రెడ్డి ఈ చిత్రం హక్కులను వరంగల్ శీనుకి ఇచ్చేందుకు రెడీ అయ్యాడు కమిషన్ బేసిస్ లో రిలీజ్ చేయడానికి వరంగల్ శ్రీను రెడీ అవుతున్నాడు. గత రాత్రి తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో వరంగల్ వరంగల్ శ్రీను ఈ సినిమా నేను నైజాం డిస్ట్రిబ్యూట్ చేయకపోతే అనధికారికంగా ఇంకెవరు డిస్ట్రిబ్యూట్ చేయకూడదు అన్నట్టు ఒక తీర్మానం లాంటిది చేసుకున్నట్టు తెలుస్తోంది.