Site icon NTV Telugu

AP Crime: రాజమండ్రిలో డబుల్‌ మర్డర్‌..! అన్నదమ్ముల మృతితో కలకలం

Crime Chattisgar

Crime Chattisgar

AP Crime: రాజమండ్రి శంబునగర్ ఫ్లై ఓవర్ కింద అన్నదమ్ములు మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. మృతులు రాజమండ్రి సాయి నగర్ చెందిన ముత్తా దుర్గారావు ముత్తా ఆంజనేయులుగా పోలీసులు గుర్తించారు.. వీరు ఇద్దరు ఫ్లేఓవర్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా పై నుండి తోసి వేసి హత్య చేశారా..? అనే పేరు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు.. కానీ, వీరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరు తరచూ గొడవ పడే వారిని అయితే ఏ విధంగా మృతి చెందారు అనేదాని పై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి టూ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు ఈమెకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఎన్ కౌంటర్.. ఎనిమిది మంది నక్సలైట్లు హతం

మృతదేహాలను రాజమండ్రి శంబు నగర్ రైల్వే ట్రాక్ ప్రక్కన పడేసి ఉన్నాయి.. అన్నదమ్ములు ఇరువురి మధ్య ఆస్తి తగాదాలు ఉండడం.. తరచూ ఆస్తులు కోసం తగాదా పడే వారిని స్థానికులు చెబుతుండగా.. ఇద్దరు ఒకే సారి ఎలా మృతిచెందారు అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది.. ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా? హత్య చేశారా? అనేది ఇప్పుడు కీలకంగా మారింది.. ఇరువురు ఒకేసారి మృతిచెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.. మరి ఈ విచారణలో ఏం తేలుతుందో చూడాలి.

Exit mobile version