Double Ismart : రామ్ సినిమా కోసం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ను సెట్ చేస్తున్న పూరి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం తన కెరీర్ మళ్ళీ సెట్ చేసుకోడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. రీసెంట్ గా స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా దారుణంగా ప్లాప్ అయింది.హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా పై భారీగా ఆశలు పెట్టుకున్నాడు కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది.లైగర్ కు ముందు పూరి తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా పూరి కి అదిరిపోయే విజయం అందించింది.ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు చేసిన సినిమాలు పూరి కి చాలా నిరాశ నే మిగిల్చాయి. ఇప్పుడు మరొక సాలిడ్ హిట్ కొడితే గానే పూరి జగన్నాద్ కు స్టార్ హీరోల సినిమాలు వచ్చే అవకాశం లేదు.ఇకపోతే గతంలో పూరి చేసిన సినిమాలలో మ్యూజిక్ అద్భుతంగా ఉండేది. సినిమా ప్లాప్ అయినా కానీ పాటలు బాగా ట్రెండ్ అయ్యేవి.
లైగర్ సినిమాలో మ్యూజిక్ అంతగా మెప్పించలేక పోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి మ్యూజిక్ కూడా ప్రధాన కారణం అని చెప్పొచ్చు.. సోషల్ మీడియా లో లైగర్ మ్యూజిక్ కి ట్రోల్స్ కూడా వచ్చాయి. పలువురు సంగీత దర్శకులు లైగర్ కి సంగీతాన్ని అందించారు. అయినా కూడా ఒక్క పాట కూడా ట్రెండింగ్ అవ్వలేదు.దాంతో ఈసారి పూరి రూపొందిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా లో అయినా పాటలు బాగుండే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.కానీ పూరి మరోసారి అదే మిస్టేక్ చేస్తున్నట్లు సమాచారం.ఇస్మార్ట్ శంకర్ సినిమా కు మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. అందులోని పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి.ఇప్పటికీ ఆ సినిమా పాటలు ఎక్కడోచోట వినిపిస్తూనే ఉన్నాయి. అలాంటి మణిశర్మ సంగీతాన్ని వదిలేసి మళ్లీ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ను వెతికే పనిలో వున్నాడని సమాచారం.తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ సంగీత దర్శకుల పాటలు నచ్చవు అని తెలిసి కూడా పూరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాడో అని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
Also Read
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
తాజావార్తలు
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!