Double iSmart OTT: ఎలాంటి ప్రకటన లేకుండానే.. ఓటీటీలోకి వచ్చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’!

  • సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన డబుల్‌ ఇస్మార్ట్‌
  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌
  • ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చిన డబుల్‌ ఇస్మార్ట్‌
Double Ismart Ott

Double Ismart Ott

Double iSmart OTT Release Date Telugu: రామ్‌ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. బ్లాక్ బస్టర్ హిట్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ.. ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. దాంతో నెల తిరక్కుండానే డబుల్‌ ఇస్మార్ట్‌ ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ వేదిక ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో డబుల్ ఇస్మార్ట్‌ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. అర్ధరాత్రి నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. థియేటర్లలో చూడడం మిస్సయిన వారు ఎంచక్కా ఇంట్లోనే ఓటీటీలో చూసేయండి.

Also Read: The Greatest Of All Time: ‘ది గోట్‌’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. రికార్డ్ ధర!

డబుల్‌ ఇస్మార్ట్‌లో రామ్‌ సరసన కావ్య థాపర్‌ కథానాయికగా నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్‌ నటుడు సంజయ్‌దత్‌ కీలకపాత్ర పోషించారు. సాయాజీ షిండే, గెటప్‌ శ్రీను, ప్రగతి, ఉత్తేజ్‌ తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఇదివరకు పూరి తీసిన లైగర్ కూడా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.