Site icon NTV Telugu

Kangana Ranaut: ఇక, వీకెండ్స్ కోసం ఎదురుచూడటం ఆపేయండి..!

Kangana

Kangana

Don’t wait for weekends: దేశ ప్రజలను ఉద్దేశించి సినీనటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారత్ ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాదు.. అధికంగా పని చేసే సంస్కృతిని మనం సాధారణీకరించాలని తెలిపారు. వీకెండ్స్ కోసం ఎదురుచూడటం ఇకనైనా మానుకోండి అని సలహా ఇచ్చింది. ఇక ‘మండే మీమ్స్‌’ (సోమవారం నుంచి స్టార్ట్ అయ్యే పని గురించి పెట్టే పోస్టులు) ఆపేయాలన్నారు. అది పాశ్చాత్య దేశాల సంస్కృతి.. సోమరితనం, విసుగు లాంటి వాటిని మనం దరి చేర్చకూడదు అని కంగనా రనౌత్‌ అన్నారు.

Read Also: Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు ఎమోషనల్

ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రాం స్టోరీలో కంగనా రనౌత్‌ పోస్ట్ చేశారు. ఇక, మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోడీ పీఎంవో సిబ్బందిని ఉద్దేశించి చేసిన ప్రసంగం తాలూకు వీడియో క్లిప్‌ను కూడా కంగనా తన ఇన్ స్టా స్టోరీలో పోస్టు చేసింది. అందులో ప్రధాని మాట్లాడుతూ.. నా జీవితంలో ప్రతి క్షణం దేశం కోసమే పని చేశాను.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తాను అని చెప్పుకొచ్చారు.. కాగా, ఇటీవలి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తన సొంత రాష్ట్రమైన హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్‌ ఎంపికయ్యారు.

Exit mobile version