NTV Telugu Site icon

Goa Governament: గోవా సర్కారు సంచలన నిర్ణయం.. ఇకపై అలా చేస్తే జరిమానా!

Goa Tourism

Goa Tourism

Goa Governament: గోవా వెళ్లాలని అనుకుంటున్నారా?.. ఇంతకు ముందులాగా అనుమతి లేకుండా పర్యాటకులతో సెల్ఫీలు మాత్రం తీసుకోకండి. ఎందుకంటే.. గోవా సర్కారు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. పర్యాటకులతో చిత్రాలను క్లిక్ చేయాలనుకున్నప్పుడు వారి గోప్యతను గౌరవించేందుకు అనుమతి తీసుకోవాలని సూచించింది. పర్యాటకుల రక్షణ, గోప్యత, ఇతర విషయాలతో పాటు వారు మోసపోకుండా ఉండేందుకు గోవా టూరిజం డిపార్ట్‌మెంట్‌ పలు సూచనలు చేసింది.

ప్రమాదాలను నివారించడానికి కొండలు, సముద్రపు రాళ్ల వంటి ప్రమాదకరమైన ప్రదేశాలలో సెల్ఫీలు తీసుకోకుండా నిషేధం విధించింది. పర్యాటక పరిశ్రమకు సంబంధించిన అనేక ఇతర సమస్యలను కూడా హెలైట్ చేసింది. తీరప్రాంతాన్ని సందర్శించే ప్రయాణికులు గ్రాఫిటీని రాయడం ద్వారా వారసత్వ ప్రదేశాలను ధ్వంసం చేయవద్దని లేదా పాడుచేయవద్దని డిపార్ట్‌మెంట్ సూచించింది. అక్రమ ప్రైవేట్ టాక్సీలను అద్దెకు తీసుకోవద్దు. అధిక ఛార్జీలను నివారించడానికి మీటర్ ఛార్జీల కోసం పట్టుబట్టండి అని పేర్కొంది. సందర్శకులు అన్ని నిబంధనలను శ్రద్ధగా పాటించాలని పర్యాటక శాక కోరింది. పర్యాటక శాఖలో నమోదైన చట్టబద్ధమైన హోటళ్లు/విల్లాలు లేదా హౌసింగ్ సదుపాయాలతో వసతిని బుక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించింది.

Fire Accident: నర్సింగ్ హోమ్ లో భారీ అగ్నిప్రమాదం.. మృతుల్లో ఇద్దరు వైద్యులు

బీచ్‌లు మొదలైన బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నిషేధించబడింది. ఇది శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందని తెలిపింది. అయితే, చట్టబద్ధంగా లైసెన్స్ పొందిన రెస్టారెంట్‌లు, హోటళ్లు మొదలైన వాటి లోపల మద్యం బాధ్యతాయుతంగా సేవించవచ్చని వెల్లడించింది. పర్యాటకులు వాటర్ స్పోర్ట్స్, రివర్ క్రూయిజ్‌లను బుక్ చేసుకునేందుకు చట్టవిరుద్ధమైన టౌట్‌లు లేదా ఏజెంట్లను సంప్రదించవద్దని సూచించింది. పర్యాటకులు అటువంటి సేవలను బుక్ చేసేటప్పుడు పర్యాటక శాఖ జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం పట్టుబట్టాలని తెలిపింది. రిజిస్టర్డ్ ట్రావెల్ ఏజెంట్లు లేదా రిజిస్టర్డ్ ఆన్‌లైన్ పోర్టల్‌ల నుండి మాత్రమే అలాంటి సేవలను బుక్ చేసుకోవాలని చెప్పింది. బహిరంగ ప్రదేశాల్లో ఆహారాన్ని వండడం నిషేధించబడిందని.. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వంట వస్తువులను స్వాధీనం చేసుకోవడంతోపాటు రూ.50,000 వరకు జరిమానా విధించడంతోపాటు ప్రాసిక్యూషన్‌కు దారితీయవచ్చని పేర్కొంది.