Rashmi Gautham: దయచేసి నా వీడియోను వాడొద్దు.. యాంకర్ రష్మి విజ్ఞప్తి!
- బుల్లితెరపై రష్మి గౌతమ్ హవా
- సోషల్ మీడియాలో రష్మి వీడియో వైరల్
- ఎక్స్‌లో రష్మి పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmi Gautham Post Goes Viral: ‘రష్మి గౌతమ్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఆమెదే హవా నడుస్తోంది. కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న రోల్స్ చేసిన రష్మి.. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు యాంకరింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మరోవైపు అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తున్నారు. అయితే తాజాగా రష్మి చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రష్మి గౌతమ్ గతంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదైన వేళ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో తాజాగా రష్మి ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. 2020లో తాను మాట్లాడాడని, దయచేసి ఇప్పుడు ఆ వీడియోను వాడొద్దని విజ్ఞప్తి చేశారు. ‘మైనర్‌ను అత్యాచారం చేయడం వేరు, క్యాస్టింగ్ కౌచ్ వేరు. 2020 కంటే ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నేను క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడా. దయచేసి ఆ వీడియోను ఇప్పుడు వాడొద్దు. జనాలను తప్పుదోవ పట్టించవద్దు. పని ప్రదేశాలు సురక్షితంగా ఉండాలి. ఓ మహిళ నో అని చెప్పిందంటే.. ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి’ అని పేర్కొన్నారు.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
Also Read: Devara Ticket Prices: ‘దేవర’ టికెట్ ధరలపై ఏపీ హైకోర్టులో పిల్!
బుల్లితెరపై అదరగొడుతున్నప్పటికీ వెండితెరపై మాత్రం రష్మికి అదృష్టం కలిసి రావడం లేదు. గుంటూరు టాకీస్ సక్సెస్ కాగా.. ఆపై వచ్చిన తను వచ్చేనంటా, అంతం, బొమ్మ బ్లాక్‌బస్టర్, అంతకుమించి లాంటి చిత్రాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు ఫుల్ ఫోకస్ టీవీ షోలపైనే పెట్టారు.
Sexually exploiting a minor is different from cast and couch where two adults might have given consent to an individual choice
Pls do not use this interview now and mislead audience
This interview was taken way before 2020
Work place shud be comfortable and and when a girl… https://t.co/zexu8Xeohu— rashmi gautam (@rashmigautam27) September 25, 2024
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!