NTV Telugu Site icon

Arvind Kejriwal: ప్రధాని మోడీకి కేజ్రీవాల్‌ కౌంటర్‌.. ఉచితాలని చెప్పి సామాన్యుడిని అవమానించొద్దు..

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: గుజరాత్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు చేస్తోన్న వాగ్దానాలపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ఉచితాల నుంచి విముక్తి కల్పించాలని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకులకు కూడా ఎన్నో ఉచితాలు అందుతున్నాయని గుర్తు చేశారు. కోటీశ్వరుల బ్యాంకు రుణాల మాటేమిటని ప్రశ్నించారు. పదే పదే ఉచితాలు రద్దు చేయాలంటు సామాన్యులను అవమానించవద్దని మండిపడ్డారు. ధరల పెరుగుదలతో బాధపడుతోన్న సామాన్య ప్రజలకు విద్య, వైద్యాన్ని ఉచితంగా ఎందుకు అందించకూడదని ప్రశ్నించారు. అవి ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఆదివారం హిందీలో ట్వీట్ చేశారు.

Pm Modi At Ayodhya: అయోధ్యలో దీపావళి వేడుక

మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో పీఎం ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల గృహప్రవేశాలను శనివారం ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశానికి ఉచితాల నుంచి విముక్తి కల్పించాలన్నారు. ఎంతో మంది పన్నుచెల్లింపుదారులు తనకు ఈవిషయంపై చాలా లేఖలు పంపారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ షేర్ చేస్తూ ప్రధాని మోడీపై కేజ్రీవాల్ విమర్శనాస్త్రాలు సంధించారు.

 

Show comments