శాంతి భధ్రతలపై సమీక్షలో వివిధ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. శాంతి భధ్రతల విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా ఉండాలన్నారు. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే నేరాలను అస్సలు ఉపేక్షించొద్దని చెప్పారు.15 శాతం వృద్ధిరేటు సాధించాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. నేరాల్లో నిర్లిప్తంగా ఉండటం సరికాదని పవన్ కళ్యాణ్ సూచించారు.
’15 శాతం వృద్ధి రేటు సాధించాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యం. విశాఖలో కొందరు ఆకస్మికంగా వచ్చి దాడి చేస్తే పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినా ఏమీ పట్టించుకోలేదు. కొందరు రాజకీయ నేతలు దీని వెనుక ఉన్నారు, చర్యలు తీసుకోకపోవటం ఇబ్బందికరం. నేరాల్లో నిర్లిప్తంగా ఉండటం సరికాదు. అధికారంలో ఉండి కూడా ఏమీ చేయటం లేదనే విమర్శలు ఎదుర్కోంటున్నాం. కఠినంగా వ్యవహరించాలని ఎస్పీలు, కలెక్టర్లను ఆదేశిస్తున్నాం. ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగించేలా జరుగుతున్న నేరాల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు’ అని కలెక్టర్లు, ఎస్పీలతో డిప్యూటీ సీఎం పవన్ అన్నారు.
Also Read: Chandrababu-Pawan Kalyan: సీఎం చంద్రబాబుకు అరుదైన గౌరవం.. పవన్ కల్యాణ్ రియాక్షన్ ఇదే!
ఇక 22వ తేదీన జనసేన ‘పదవి – బాధ్యత’ సమావేశం జరగనుంది. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున నామినేటెడ్ పదవులు పొందిన వారితో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశం ద్వారా వారికి పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేస్తారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయిలో వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా స్థాయి పదవులు, ఏఎంసీ, పిఏసిఎస్, నీటి సంఘాలలో నామినేటెడ్ పదవులకు ఎంపికైన వారు ఈ సమావేశంలో పాల్గొంటారు.
