Kejriwal: ఆ ఫుకార్లు నమ్మొద్దు.. ఆప్ సర్కార్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ అయిన నేపథ్యంలో తాజాగా రకరకాలైన వదంతులు పుట్టుకొస్తున్నాయి. సంక్షేమ పథకాలు నిలిచిపోతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆప్ సర్కార్ అప్రమత్తమైంది. కేజ్రీవాల్ అరెస్టుతో సంక్షేమ పథకాలు నిలిచిపోతాయంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఆప్ సర్కార్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్లానింగ్ డిపార్టుమెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది.
కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఢిల్లీలో అమలవుతోన్న సంక్షేమ పథకాలు, సబ్సిడీలు నిలిచిపోతాయంటూ సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేసింది. చట్టం తన పని తాను చేస్తుందని.. పథకాల అమలు, పాలన అనేవి ఎప్పుడూ వ్యక్తులకు సంబంధించినవి కావని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాన్య ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకే ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని పేర్కొంది. కేజ్రీవాల్ ఆదేశాల మేరకే ఈ ప్రకటన విడుదల చేసినట్లు ఆప్ వర్గాలు స్పష్టం చేశాయి.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
గతంలో మాదిరిగానే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు, రాయితీలు, పింఛన్లు తదితర సేవలన్నీ నిరాంతరాయంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రజా సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయింపులతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నామని.. ఈ డబ్బు ఒక వ్యక్తి లేదా రాజకీయ పార్టీల సొంత ఆస్తులు కాదని వెల్లడించింది. అందువల్ల ముఖ్యమంత్రి అరెస్టు లేదా రిమాండ్‌తో ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని పేర్కొంది. కొన్ని స్వార్థపూరిత శక్తులు చేసే ఇలాంటి తప్పుదారి పట్టించే సమాచారాన్ని నమ్మొద్దని ఈ సందర్భంగా ప్రజలకు సర్కార్ విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: DK Shivakumar: దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియాగాంధీ చేశారు.. కాంగ్రెస్‌తోనే దేశం ఐక్యంగా ఉంటుంది..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈనెల 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇక జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండు ఆదేశాలు జారీ చేశారు. ఇక అరెస్ట్, ఈడీ కస్టడీపై హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ బుధవారం జరగనుంది. మరీ ఊరట లభిస్తుందా? లేదంటే జైల్లో ఉండాల్సి వస్తుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
ఇది కూడా చదవండి: Manjummel Boys: మలయాళ ఇండస్ట్రీ హిట్, తెలుగు రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!