Donald Trump: రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్, నెట్‌ఫ్లిక్స్ బోర్డ్ మెంబర్ సుసాన్ రైస్ మధ్య నెలకొన్న మాటల యుద్ధం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌పై విమర్శల దాడికి దిగారు. ఆ సంస్థ బోర్డ్ మెంబర్ సుసాన్ రైస్‌ను వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో భారీ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఇదివరకు బరాక్ ఒబామా వద్ద జాతీయ భద్రతా సలహాదారుగా, జో బైడెన్ ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించిన సుసాన్ రైస్.. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ డిమాండ్లకు లొంగిపోయి, ఆయనకు విధేయత ప్రకటించిన కార్పొరేట్ సంస్థలు, వార్తా సంస్థలు, లా ఫామ్‌లు ఇప్పుడు ప్రజల్లో ఆదరణ కోల్పోయాయని ఆమె అన్నారు. అంతేకాకుండా.. ఒకవేళ డెమొక్రాట్లు తిరిగి అధికారంలోకి వస్తే, ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన సంస్థలు ఖచ్చితంగా జవాబుదారీతనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. డెమొక్రాట్లు పాత పద్ధతుల్లోనే వెళ్తారని భావిస్తే అది పొరపాటే అని ఆమె హెచ్చరించారు.
Income Tax Rules: క్రెడిట్ కార్డ్ వినియోగదారులు జాగ్రత్త.. ఐటీ శాఖ కొత్త నిబంధనలు ఇవే!
సుసాన్ రైస్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ట్రంప్, ఆమెను నెట్‌ఫ్లిక్స్ బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే ఆయన పేర్కొన్న ‘పరిణామాలు’ ఏమిటన్నది స్పష్టంగా వెల్లడించలేదు. కానీ గతంలోనూ తనకు నచ్చని కంటెంట్ ను ప్రసారం చేసే నెట్‌వర్క్ లను ట్రంప్ విమర్శిస్తూనే ఉన్నారు. మరోవైపు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (FCC) ఛైర్మన్ బ్రెండన్ కార్ కూడా గతంలో కొన్ని నెట్‌వర్క్‌ల బ్రాడ్‌కాస్ట్ లైసెన్స్ లను రద్దు చేస్తామని హెచ్చరించారు.
