Site icon NTV Telugu

Donald Trump: సొంత బ్రాండ్‌ షూస్‌ను విడుదల చేసిన డొనాల్డ్ ట్రంప్.. కేవలం 399 డాలర్లే

Trump

Trump

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సొంత బ్రాండ్‌ షూస్‌ను రిలీజ్ చేశారు. ఆదివారం నాడు ఫిలడెల్ఫియాలో కన్వెన్షన్‌ సెంటర్‌లో గోల్డెన్ షూలను ఆవిష్కరించాడు. అయితే, వీటి ధర కేవలం 399 డాలర్లకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, వీటితో పాటు విక్టరీ 47 అనే సెంటును కూడా ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ స్టేజీ పైకీ రావడంతో ఒక్కసారిగా అరుపులు, ఆనందోత్సాహాలు కనిపించాయి. ఇక, ట్రంప్ మొదటి అధికారిక పాదరక్షలుగా పేర్కొన్నారు.

Read Also: CMR Mega Drone Show: 500 డ్రోన్లతో సీఎంఆర్‌ మెగా డ్రోన్‌ షో

ఇక, ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపిన నేరానికి కోర్టు ఏకంగా 35.5 కోట్ల డాలర్ల భారీ జరిమానాను విధించిన తర్వాత రోజే మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా ట్రంప్‌ బరిలోకి దిగనున్నారు.

Read Also: CM Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్‌.. ఆ జాబితాపై హైకమాండ్‌తో భేటీ

ఇక, అంతకు ముందు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ తన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అనుకూలంగా ఉన్నారని విమర్శించారు. పుతిన్ అమెరికన్లతో స్నేహం కొనసాగించకూడదు.. ఎందుకంటే, అతను అమెరికాతో స్నేహంగా ఉండే వ్యక్తి కాదు.. అస్సలు పుతిన్ మా స్నేహితుడు కాదని అమెరికన్ ప్రజలకు గుర్తుచేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. వ్లాదిమిర్ పుతిన్ మంచి వ్యక్తి కాదు అని నిక్కీ హేలీ పేర్కొన్నారు.

Exit mobile version