US Presidential Elections: అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. 2024 నవంబర్/డిసెంబర్ నెలల్లో అక్కడ ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. నాలుగు సంవత్సరాల తర్వాత ప్రతి జనవరి 20వ తేదీన కొత్త ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేయడం అమెరికాలో ఆనవాయితీగా వస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రవాస భారతీయుడు వివేక్ రామస్వామి ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రీపోల్ సర్వేల్లో డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో జో బైడెన్ కంటే కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వైపే అమెరికన్ ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
Read Also: Rakul Preet Singh : వామ్మో.. రకుల్ ఆ డ్రెస్సు ఏంటి..? ఇలా చూస్తే కుర్రాళ్లకు పండగే..
అయితే, ఈ పరిస్థితుల్లో కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ట్రంప్ అనర్హుడని కోర్టు ప్రకటించింది. 2020లో అధ్యక్ష ఎన్నికల తర్వాత ఆ దేశ పార్లమెంట్ భవనంపై దాడి ట్రంప్ వల్లే జరిగిందని కోర్టు తెలిపింది. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి.. డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడానికి ఎన్నికల కమిషన్ కారణమంటూ 2021 జనవరి 6వ తేదీన ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున వాషింగ్టన్‌లో నిరసన చేశారు. ఆ ర్యాలీ సందర్భంగా మద్దతుదారులు యూఎస్ పార్లమెంట్ భవనంపై దాడికి పాల్పడ్డారు. దీంతో ట్రంప్ వల్లే ఇలాంటి హింసాత్మక ఘటన చోటు చేసుకుంది అందుకే అతడ్ని ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఏడు మంది న్యాయమూర్తుల ధర్మాసనం ప్రకటించింది.
Read Also: Jan Dhan Yojana : మూతపడిన 10 కోట్ల బ్యాంకు ఖాతాలు.. క్లెయియ్ చేయకుండా మిగిలిన రూ.12 వేల కోట్లు
ఇక, ఎన్నికల బ్యాలెట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ పేరును తొలగించాలని కొలరాడో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, ట్రంప్ కు ఊరట కలిగించే విషయం ఒకటి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ తీర్పు కేవలం కొలరాడో స్టేట్ వరకు మాత్రమే పరిమితమౌతుందని వెల్లడించింది. అంటే కొలరాడో స్టేట్‌లో జరిగే ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పేరు ఉండదన్నమాట. మిగిలిన రాష్ట్రాలకు కోర్టు తీర్పు వర్తించదని తెలిపింది. అక్కడ ఆయన పోటీ చేయొచ్చు అని న్యాయస్థానం చెప్పింది. ఇక, ఈ తీర్పుపై ఏడుగురు సభ్యులతో కూడిన న్యాయమూర్తుల ధర్మాసనంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ముగ్గురు జడ్జీలు ఈ తీర్పును వ్యతిరేకించగా.. మిగతా నలుగురు ట్రంప్ నిషేధానికి ఒకే చెప్పారు. మెజారిటీ సభ్యులు ట్రంప్ అనర్హతకు అనుకూలంగా ఉండటంతో ఈ తీర్పును వెల్లడించింది.