Donald Trump and Pm Modi Meeting: అమెరికాలోని మిచిగాన్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో అమెరికా వాణిజ్యంపై మాట్లాడిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం ప్రధాని మోదీని కలుస్తానని ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ మాటలకి ఇప్పుడు ప్రాచుర్యం ఏర్పడింది. దీనికి సంబంధించి ఎన్నికల ప్రచారం శరవేగంగా సాగుతోంది. ఈ ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ వచ్చే వారం ప్రధాని మోడిని కలుస్తానని చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు నేతలు ఎక్కడ భేటీ అవుతారనే దానిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
Government jobs: 10th పాస్ అయితే చాలు.. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు..
సెప్టెంబరు 21 నుండి 23 వరకు పిఎం మోడీ యునైటెడ్ స్టేట్స్‌లో పర్యటించనున్నారు. ఆ సమయంలో అతను క్వాడ్ సమ్మిట్‌కు హాజరవుతారు. న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో ప్రసంగిస్తారు. డెలావేర్ లోని విల్మింగ్టన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆతిథ్యమివ్వనున్న నాలుగో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ఇది. దీని తర్వాత న్యూయార్క్‌లో జరిగే భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. దీని తర్వాత, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘ఫ్యూచర్ సమ్మిట్’లో కూడా ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. ‘మెరుగైన రేపటి కోసం బహుపాక్షిక పరిష్కారాలు’ అనే అంశంతో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు.
Womens T20 Worldcup 2024: భారీగా పెరిగిన మహిళల టి20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ..
ఇకపోతే, రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి మిచిగాన్‌లో ప్రచారం చేస్తూ.. పిఎం మోడీతో తన సమావేశాన్ని ప్రకటించాడు. అందులో పిఎం మోడీ ‘అద్భుతమైనవాడు’ అని అన్నారు. తదుపరి డొనాల్డ్ ట్రంప్, ‘అతను వచ్చే వారం నన్ను కలవడానికి వస్తున్నాడు’ అని చెప్పాడు. పిఎం మోడీ, డొనాల్డ్ ట్రంప్‌ల చివరి సమావేశం 2020 ఫిబ్రవరిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి వచ్చినప్పుడు జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇదొక మార్గదర్శక క్షణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.