Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్‌పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- అమెరికాను “క్షీణిస్తున్న దేశం”గా పేర్కొన్న జిన్‌పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందన
- “ఆ వ్యాఖ్య 100% నిజమే” అని ట్రంప్ సంచలన వ్యాఖ్య
- అయితే అది తన పాలనకు కాదు..
- జో బైడెన్ హయాంలో పరిస్థితులకు సంబంధించినదని స్పష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన చైనా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ (Xi Jinping) అమెరికాను “క్షీణిస్తున్న దేశం”గా పేర్కొన్న విషయంపై స్పందించిన ట్రంప్.. “ఆ వ్యాఖ్య 100% సరైనదే” అని అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలు తన పాలనకు కాకుండా మాజీ అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden) హయాంలోని పరిస్థితులకు సంబంధించినవని స్పష్టం చేశారు.
ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్.. “బైడెన్ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో అమెరికా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. ఓపెన్ బోర్డర్స్, అధిక పన్నులు, తప్పు వాణిజ్య ఒప్పందాలు, పెరుగుతున్న నేరాలు, DEI విధానాలు వంటి అంశాలు దేశాన్ని బలహీనపరిచాయి” అని ఆరోపించారు. అలాగే తన పాలనలో అమెరికా మళ్లీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగిందని ట్రంప్ పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయని, ఉద్యోగావకాశాలు భారీగా పెరిగాయని, విదేశీ పెట్టుబడులు ట్రిలియన్ల డాలర్లుగా అమెరికాలోకి వస్తున్నాయని తెలిపారు. సైనిక రంగంలోనూ అమెరికా బలంగా నిలిచిందని, ఇరాన్‌పై విజయం సాధించామని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
వెనిజులాతో సంబంధాలు మెరుగుపడ్డాయని కూడా ట్రంప్ పేర్కొన్నారు. “రెండేళ్ల క్రితం అమెరికా నిజంగానే క్షీణించిన దేశంగా ఉండేది. ఆ విషయంలో జిన్‌పింగ్‌తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కానీ ఇప్పుడు అమెరికా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదిగిన దేశంగా మారింది” అని ట్రంప్ తెలిపారు. ఇక భవిష్యత్తులో అమెరికా-చైనా సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తక్కువ సమయంలోనే తన ప్రభుత్వం సాధించిన విజయాలపై జిన్‌పింగ్ అభినందించారని కూడా ట్రంప్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్‌పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్‌పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!