Site icon NTV Telugu

Donald Trump : ‘ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్’.. ట్విటర్ పై ట్రంప్ అసహనం

Trump

Trump

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతేడాది ఆరంభంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం అల్లర్లను ప్రోత్సహించారంటూ నిబంధనల ఉల్లంఘన కింద ట్రంప్ ఖాతాను ట్విటర్ బ్లాక్ చేసింది. ఎలాన్ మస్క్ ట్విటర్ సంస్థను స్వాధీనం చేసుకున్న తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ట్రంప్ ట్విటర్ ఖాతాను పునరుద్ధరించారు. కానీ ట్విటర్ మీద కోపంతో ట్రంప్ తానే సొంతంగా ట్రూత్ అనే సోషల్ మీడియా యాప్ ను తయారు చేసుకున్నారు. అప్పటి నుంచి ట్రూత్ సోషల్ మీడియా ద్వారానే తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ట్విటర్ లోకి తిరిగి వచ్చేందుకు ట్రంప్ ఆసక్తిగా లేనట్టు ప్రకటించారు.

Read Also: Employees Shock To Twitter : ట్విటర్‎కు షాక్.. ఒకే సారి 1200మంది ఉద్యోగుల రాజీనామా

రిపబ్లికన్ కొయిలిషన్ వార్షిక నాయకత్వ సమావేశాన్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. తిరిగి ట్విట్టర్ లోకి రావడానికి ఇష్టపడడం లేదని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ రూపొందించిన ట్రూత్ సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తోందన్నారు. తాను దానికే పరిమితమవుతానని ట్రంప్ చెప్పారు. తనను ట్విట్టర్ లోకి ఆహ్వానించినందుకు ఎలాన్ మస్క్ ను అభినందించారు. 2024లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి తిరిగి వైట్ హౌస్ లోకి అడుగు పెట్టే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా? అంటూ అంతకుముందు ఎలాన్ మస్క్ ట్విట్టర్ పై పోల్ నిర్వహించగా, 51.8 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. ట్విట్టర్ లో ట్రంప్ కు ఇప్పటికీ 8.7కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంత మంది ఉండడంతో, మస్క్ సైతం ఆయన ఖాతాను పునరుద్ధరించక తప్పలేదు.

Exit mobile version