Site icon NTV Telugu

Donald Trump: వలసలను ఆపకుంటే యూరప్ నాశనం..ట్రంప్ బిగ్ వార్నింగ్..

Trump

Trump

Donald Trump: యూరప్ దేశాల్లోకి ఇబ్బడిముబ్బడిగా కొనసాగుతున్న వలసలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ‘‘వలసలు యూరప్‌ని చంపేస్తున్నాయి’’ అంటూ శనివారం ఆయన వ్యాఖ్యానించారు. వలసల్ని నిరోధించడానికి కలిసి రావాలని అన్నారు. స్కాట్లాండ్‌లో పర్యటనలో ఉన్న ట్రంప్ నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. చాలా యూరోపియన్ దేశాలు ‘‘భయంకరమైన దండయాత్ర’’లను ఎదుర్కొంటున్నాయని, వీటిని ఆపాల్సిన అవసరం ఉందని అన్నారు.

Read Also: World Leaders: భార‌త్‌లో చదువుకున్న ప్రపంచ నాయకులు వీరు..

వలసల విషయంలో కలిసి పనిచేయడం మంచిదని, లేకుంటే మీకు ఇకపై యూరప్ ఉండదని యూరోపియన్ దేశాలకు బిగ్ వార్నింగ్ ఇచ్చారు. కొంతమంది నాయకులు వీటిని అడ్డుకోవడం లేదని, వారి పేర్లు చెప్పగలను అని, ఈ వలసలు యూరప్‌ని చంపుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు ట్రంప్ తండ్రి ఫ్రెడ్, తల్లి మేరీ అన్నే మాక్లియోడ్ యూరప్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు.

గత నెలలో మా దేశం(యూఎస్)లోకి ఎవరూ ప్రవేశించలేదని, చాలా మంది చెడ్డ వ్యక్తుల్ని బయటకు పంపామని చెప్పారు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం, మొత్తం యూరోపియన్ దేశాల్లో దాదాపుగా 87 మిలియన్ల మంది అంతర్జాతీయ వలసదారులు ఉన్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వలసల బహిష్కరణకు తాను నాయకత్వం వహిస్తానని ట్రంప్ అన్నారు.

Exit mobile version