NTV Telugu Site icon

Donald Trump: పోర్న్ స్టార్‌కు రహస్యంగా డబ్బు చెల్లించిన కేసులో దోషిగా తేలిన ట్రంప్

Donald Trump

Donald Trump

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు మరో షాక్ తగిలింది. పోర్న్​ స్టార్​ స్టార్మీ డేనియల్ ​తో సంబంధం బయటపడకుండా అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారన్న కేసులో.. ట్రంప్​ దోషిగా తేలిపోయారు. ఈ మేరకు.. ఆయనపై మోపిన మొత్తం 34 నేరాభియోగాలు నిజమేనని న్యూయార్క్​ కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే, ఇంకో 5 నెలల్లో జరగనున్న 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి, తిరిగి అధ్యక్ష పదవి చేపట్టాలని అనుకుంటున్న ట్రంప్ కు.. తాజా తీర్పుతో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. సంబంధిత కేసు కోసం మాన్​హాటన్​లోని కోర్టుకు మాజీ అధ్యక్షుడు వెళ్లాడు. జడ్జి మాటలు వింటూ సైలెంట్ గా ఉండిపోయారు. కానీ, కోర్టు బయటకు వచ్చి, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ​పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ప్రభుత్వం తన మీద చేస్తున్న కుట్ర అని ఆరోపణలు చేశారు. కోర్టులో కూడా రిగ్గింగ్​ జరిగింది.. కానీ నవంబర్​ లో జరిగే అధ్యక్ష ఎన్నికల తర్వాత ప్రజలే నిజమైన తీర్పును ఇస్తారని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

Read Also: Prajawal Revanna : బెంగుళూరు చేరుకున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్ .. నేడు కోర్టులో హాజరు

అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలడం చాలా అరుదైన ఘటన. కానీ.. దోషిగా తేలినప్పటికీ, చట్ట ప్రకారం ట్రంప్​.. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చు.. పోర్న్​ స్టార్మీ డేనియల్ తో కేసులో ఆయనకు జైలు శిక్ష పడినా.. అధ్యక్ష ఎన్నికల బరిలో దిగే ఛాన్స్ ఉంది. ఈ కేసుకు సంబంధించి.. జులై 11వ తేదీన కీలక తీర్పును న్యూయార్క్​ కోర్టు వెల్లడించనుంది. సరిగ్గా అందుకు కొన్ని రోజుల ముందే.. మిల్వాకీలో రిపబ్లికెన్​ నేషనల్​ కన్వెన్షన్​ జరగనుంది. ఈ ఈవెంట్​లో.. డెమొక్రటిక్​ అభ్యర్థి జో బైడెన్ కి పోటీగా డొనాల్డ్​ ట్రంప్ ​ని రిపబ్లిక్​ పార్టీ అధికారికంగా ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. కాగా, ఈ నిర్ణయాన్ని ట్రంప్‌ న్యాయవాద బృందం సవాలు చేయనుంది.