ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమలోని సృజనాత్మకతను బయటికి తీస్తున్నారు. మిడ్ జర్నీ అనే కృత్రిమ మేథను వినియోగించి గోకుల్ పిళ్లై అనే ఆర్టీస్ట్ కోటీశ్వరుల్ని నిరుపేదలుగా మార్చేస్తున్నారు. కుబేరుల్ని మురికివాడల్లో నివాసిస్తున్న వారిగా చిత్రకరిస్తున్నారు. బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, మార్క్ జుకర్ బర్గ్, ఎలాన్ మస్క్ వంటి బిలియనీర్స్ సరైన బట్టులు కూడా లేకుండా మురికి వాడలో ఉంటే ఎలా ఉంటారో అనే విధంగా ఫోటోలను ఎడిట్ చేసిన ఫోటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. భారత దిగ్గర వ్యాపారి ముకేశ్ అంబానీ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ ఫోటోలను గోకుల్ పిళ్లై ఆన్ లైన్ లో షేర్ చేస్తూ.. స్లమ్ డాగ్ మిలియనీర్స్ అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
Also Read : Vizag Steel Plant: వైజాగ్ ఉక్కు బిడ్డింగ్‌లో తెలంగాణ.. కేసీఆర్ సంచలన నిర్ణయం!
అయితే ఈ ఫోటోలను చూసిన కొందరు నెటిజన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయని కొనియాడుతున్నారు. వీరందరిలో ఎలాన్ మస్క్ మాత్రం నిరుపేద అవతారంలో కూడా సూపర్ రిచ్ గా కన్పిస్తున్నాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఎంతైనా మస్క్ మస్కే అంటూ నవ్వులు పూయించాడు. కాగా.. కొద్ది రోజుల క్రితం మార్క్ జుకర్ బర్గ్ కు సంబంధించిన ఓ ఏఐ ఫోటో కూడా సామిజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ అధునాతన సాంకేతికతో రూపొందించిన ఫోటోలు నిజమైన ఫోటోలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి. దీంతో అసల ఫోటోలు, ఎడిట్ చేసిన ఫోటోల మధ్య తేడా కూడా కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది.
Also Read : CM KCR Decision Live: సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
