Site icon NTV Telugu

Shocking Video: పామును కొరికి చంపుతున్న కుక్కలు.. చూస్తే షాకవుతారు..!

Dogs

Dogs

Shocking Video: కుక్కలు మానవులకు మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కుక్కలు విశ్వాసంగా మనుషులు చెప్పినట్లు వింటాయి. మరికొందరేమో కుక్కలంటే ఇష్టపడి పెంచుకుంటారు. కానీ కొన్నిసార్లు కుక్కలు మనుషులకు శత్రువులుగా కూడా మారతాయి. కుక్కలు మనుషులను కరిచి గాయపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో జీవన్మరణ మధ్య ఊగిసలాడడం వంటి సంఘటనలు మనం ఎన్నో చూసి ఉంటాం.. విని ఉంటాం కూడా. అయితే ప్రస్తుతం కుక్కలకు సంబంధించి ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో కుక్కలు ఏ మనిషిని చంపడం లేదు. కానీ పామును ఘోరాతి ఘోరంగా కరిచి చంపేస్తున్నాయి.

Tamim Iqbal: బంగ్లాదేశ్ ప్రధాని జోక్యంతో రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్న తమీమ్ ఇక్బాల్

ఈ వీడియోలో.. ఒక కుక్క తన నోటితో నుండి పొదల్లో ఉన్న పామును తీసుకువచ్చి తన తోటి కుక్కల మధ్యలో వదిలివేయడాన్ని మీరు చూడవచ్చు. ఈ సమయంలో పాము మొదట కుక్కల నుండి ప్రాణాలను రక్షించుకోడానికి భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ తరువాత కుక్కల నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది జరగదు. కుక్కలు పామును బాగా ఇబ్బంది పెడతాయి. కొన్ని కుక్కలు పాము తోకను పట్టుకుని కొరుకుతుంటాయి. అంతేకాకుండా మరికొన్ని కుక్కలు పాము నోటిని పట్టుకుని కొరుకుతుంటాయి. ఇంతలో ఒక కుక్క తన క్రూరమైన రూపాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా పామును క్రూరాతి క్రూరంగా కొరుకుతుంటాయి.

ISRO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇస్రోలో ఖాళీలు.. పూర్తి వివరాలు..

అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ilhanatalay_ అనే IDతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అయితే 5 లక్షల మందికి పైగా ప్రజలు వీడియోను లైక్ చేసారు. అంతేకాకుండా ఈ వీడియోను పలువురు కామెంట్స్ చేశారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీస్తున్న వ్యక్తిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల బారి నుంచి పామును కాపాడి ఉండాల్సిందని, చంపే సమయంలో వీడియో తీయలేదని చెబుతున్నారు. అదే సమయంలో కొంతమంది వినియోగదారులు కుక్కలు కలిసి పాము పరిస్థితిని మరింత దిగజార్చడం, ఐక్యతలో బలం ఉందని తెలియజేస్తుందని కూడా అంటున్నారు.

Exit mobile version