56Blades in Stomach : రాజస్థాన్‌లోని జలోర్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఓ యువకుడి కడుపులో రెండు కాదు ఏకంగా 56 షేవింగ్ బ్లేడ్‌లను తొలగించారు. ఆత్మహత్య చేసుకునేందుకు యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇతడు సంచార్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.
యువకుడి పేరు యశ్‌పాల్‌రావు. బాలాజీ నగర్‌లో నలుగురు స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఉద్యోగ సమస్యల కారణంగా డిప్రెషన్‌లో ఉన్నాడు. ఎలాగైనా చనిపోవాలని నిర్ణయించుకుని బ్లేడ్ ముక్కలను మింగాడు. వెంటనే రక్తపు వాంతులు చేసుకోవడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో అతని కడుపు ఎక్స్-రే తీశారు వైద్యులు. అప్పుడు అతని కడుపులో షేవింగ్ బ్లేడ్ ముక్కల కుప్ప కనిపించింది. ఆ తర్వాత డాక్టర్ ఎండోస్కోపీ చేసి ఆపరేషన్ చేసి 56 షేవింగ్ బ్లేడ్ ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి అతని కడుపులో నుంచి తొలగించారు.
Read Also:Bomb Blast : పాక్‌లోని బలూచిస్థాన్‌లో బాంబు పేలుడు.. ఇద్దరి మృతి
ఇంతకీ ఏం జరిగిందంటే.. అతని స్నేహితులు ఆదివారం బయటకు వెళ్లారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఏకంగా మూడు బ్లేడ్ల పాకెట్లను మింగేశాడు. దీంతో రక్తపు వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. అతని ఆరోగ్యం క్షీణించింది. రక్తపు వాంతులు కావడంతో భయాందోళనకు గురై స్నేహితులకు ఫోన్ చేశాడు. దీంతో ఆయనను నగరంలోని మన్మోహన్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మరో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుడు నర్సిరామ్ దేవాసి ముందుగా ఎక్స్ రే తీశారు. తర్వాత సోనోగ్రఫీ చేశారు. యశ్‌పాల్ కడుపులో చాలా బ్లేడ్లు లభ్యమయ్యాయి. అనంతరం ఆపరేషన్‌కు సన్నాహాలు చేశారు. ఏడుగురు వైద్యుల బృందం మూడు గంటల పాటు ఆపరేషన్ చేసింది. యశ్‌పాల్ కడుపులో నుంచి 56 బ్లేడ్లు బయటపడ్డాయి.
Read Also: BRS: మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగసభ.. కేసీఆర్ టార్గెట్ అదే
ప్రస్తుతం యశ్‌పాల్ పరిస్థితి బాగానే ఉంది. వైద్యులు కూడా ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. అతని శరీరంలో కొంత భాగం దెబ్బతింది. అంతర్గతంగా దెబ్బతినడంతో మందులు ఇస్తున్నారు. యశ్‌పాల్ ఉద్యోగం కోసం బాధపడుతున్నాడు. ఉద్యోగ సమస్యల కారణంగా డిప్రెషన్‌లో ఉన్నాడు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనే తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
