NTV Telugu Site icon

Andhra Pradesh: గర్భిణికి ఆపరేషన్‌.. కడుపులోనే కత్తెర వదిలేసి కుట్లు..

Scissors

Scissors

Andhra Pradesh: ఏ రోగాన్ని అయినా నయం చేసే శక్తి ఒక వైద్యుడికే ఉంటుంది.. అయితే, వైద్యం చేస్తున్న సమయంలో కొన్నిసార్లు పొరపాట్లు జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయి.. ఒక సమస్యతో వెళ్తే.. మరో ట్రీట్‌మెంట్‌ చేసి ప్రాణాలు తీసిన ఘటనలు కూడా లేకపోలేదు.. అయితే, తాజాగా, ఏలూరులో ఆలస్యంగా వెలుగు చూసిన ఓ ఘటన కలకలం రేపుతోంది.. గర్భిణికి ఆపరేషన్‌ చేసిన వైద్యులు.. ఆమె కడుపులోనే కత్తెర వదిలేశారు.. కడుపులో కత్తెర మరిచి కుట్లు వేశారు.. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఈ దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది..

Read Also: Pakistan Petrol Price: పాక్ ప్రజలపై పెట్రో బాంబ్.. లీటరుకు రూ.15పెంపు..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వారం క్రితం కాన్పు కోసం ఓ గర్భిణీ మహిళ చేరింది.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆమెకు సిజేరియన్‌ చేసి, పండంటి బిడ్డను బయటకు తీశారు. అంత వరకు బాగానే ఉన్నా.. ఆపరేషన్‌ తర్వాత కుట్లు వేసే క్రమంలో కడుపులో ఉన్న కత్తెరను తీయడం మరిచిపోయారు. అయితే, అప్పటి నుంచి బాధితురాలు కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతోంది. దీంతో వైద్యులు ఎక్స్‌రే తీయించడంతో కడుపులో కత్తెర ఉన్న విషయం వెలుగు చూసింది.. ఈ ఘటనను బయటకు రాకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుండగా.. ఆ ఎక్స్‌రే ఫొటోను ఓ ద్యోగి తన ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో పోస్టు చేయడంతో.. ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది.. దీంతో, షాక్‌ తిన్న ఆస్పత్రి అధికారులు ఆ ఉద్యోగిని పిలిచి మందలించడంతో ఆ పోస్టులను తొలగించాడు. మరోవైపు.. ఆస్ప త్రి రికార్డుల్లో బాధితురాలి వివరానలు కూడా మాయం చేశారని ఆరోపణలు వినిపిస్తు్న్నాయి.. దీనిపై వైద్యులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు.. మరోవైపు.. వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోగులు.

Show comments