Site icon NTV Telugu

Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్‌కు వైద్యుల విజ్ఞప్తి

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌లో ఉన్న వైద్యులకు పీజీలో ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించి జీవో 85 తమకు రావాల్సిన సీట్లను దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు విజ్ఞాపన పత్రం అందచేశారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం దగ్గర అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. గతంలో మూడేళ్ళ సర్వీస్ ఉంటే సీటుకు అర్హత ఇచ్చేవారని, ఇప్పుడు అయిదేళ్లు చేయడమే కాకుండా, ఇన్ సర్వీస్ కోటాలో సీట్లు శాతాన్ని కూడా తగ్గించారని వివరించారు. వీరు ప్రస్తావించిన అంశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.

Read Also: IPS Transfers: రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

Exit mobile version