Site icon NTV Telugu

Rashmika Mandanna: ఆ పని అస్సలు చేయొద్దంటూ.. రష్మికను మందలించిన డాక్టర్‌!

Rashmika

Rashmika

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్‌ ఖురానా తాజాగా నటించిన సినిమా ‘థామా’. ఈ హారర్‌ కామెడీ మూవీని ఆదిత్య సర్పోదర్‌ రూపొందించారు. అక్టోబర్ 21 ప్రేక్షకుల ముందుకు వచ్చిన థామా.. బాక్సాఫీస్‌ వద్ద బంపర్ హిట్ కొట్టింది. కలెక్షన్లలో దూసుకెళుతోంది. ఈ సినిమాలో రష్మిక గ్లామర్ యువతను ఆట్టుకుంది. ముఖ్యంగా ‘తుమ్‌ మేరీ నా హుయే’ పాటలో చేసిన డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. తాజాగా రష్మిక ఈ సాంగ్ షూటింగ్ అనుభవంను ప్రేక్షకులతో పంచుకున్నారు. కాలికి ఫ్యాక్చర్‌ అయినా షూటింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.

Also Read: Payyavula Keshav: బస్సు ప్రమాదంపై కూడా శవరాజకీయాలు చేయడం బాధాకరం!

రష్మిక మందన్న తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘గత జనవరిలో జిమ్‌ చేస్తూ గాయపడ్డాడు. నా కాలికి ఫ్యాక్చర్‌ అయింది. డాక్టర్లు 3 నెలలు విశ్రాంతి తీసుకోమన్నారు. అదే సమయంలో ఛావా మూవీ ప్రమోషన్స్‌ ఉండడంతో 30 రోజులు ప్రయాణించా. కాలి నొప్పి ఎక్కువ కావడంతో మరోసారి డాక్టర్‌ వద్దకు వెళ్లాను. విషయం తెలుసుకున్న డాక్టర్ నన్ను మందలించారు. కాలు వాచిపోవడంతో రెస్ట్ తప్పనిసరి అని మరలా చెప్పారు. అయితే అప్పటికే పాటకు సంబంధించిన షెడ్యూల్‌ ఫిక్స్ అయింది. దాంతో నొప్పితోనే థామా సాంగ్‌ షూటింగ్‌లో పాల్గొన్నా. ఈరోజు ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తుంటే.. అప్పటి బాధ నాకు పెద్దదిగా అనిపించ లేదు. నేను ప్రేక్షకుల కోసమే కష్టపడుతా. అభిమానుల ముఖాల్లో ముఖాల్లో ఆనందం నింపడం కోసమే ఇదంతా’ అని చెప్పారు.

Exit mobile version