Site icon NTV Telugu

Contact Lense: వామ్మో.. కంట్లో ఇన్ని కాంటాక్ట్ లెన్సా ?.. షాక్ తిన్న డాక్టర్

Contact Lens

Contact Lens

Contact Lense: ఈ రోజుల్లో చాలా మంది కళ్లద్దాలకు బదులు కాంటాక్ట్ లెన్సులు వాడుతున్నారు. కళ్లద్దాలు పెట్టుకోవడం వల్ల అందం పాడవుతుందని కొందరు.. మచ్చలు ఏర్పడుతున్నాయని మరికొందరు కాంటాక్ట్ లెన్సులను వాడేస్తున్నారు. దీంతో ఇటీవల వీటి వినియోగం భారీగా పెరిగిపోయింది. అయితే వాటిని వాడడం అంత సులువు కూడా కాదు. అందుకు ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకోవాలి. ఎందుకంటే కన్ను చాలా సున్నితమైన అవయవం. అందుకే వాటిని వాడే ముందు శుభ్రంగా ఉంచుకోవాలి. వాటిని పెట్టుకున్న తర్వాత కళ్లను రుద్దకూడదు. పడుకునే ముందు తప్పనిసరిగా వాటిని తీసేసి నిద్రపోవాలి. లేకుంటే అవి కంటి లోపలికి పోయే ప్రమాదం ఉంది.

ఎవరి కళ్లల్లోనైనా ఒకటికి మించి కాంటాక్ట్‌ లెన్సులు ఉండవు. కానీ ఓ మహిళ కంట్లో ఏకంగా 23 కాంటాక్ట్‌ లెన్స్‌లు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సదరు మహిళ గత కొన్ని రోజులుగా అద్దాలకు బదులుగా కాంటాక్ట్‌ లెన్స్‌లను ఉపయోగిస్తోంది. అయితే, కొన్ని రోజులుగా ఆమె నిద్రకు ముందు వాటిని తొలగిండం మరిచిపోయి.. ఉదయం మరో కొత్త లెన్స్‌ పెట్టుకునేది.

Read Also: Idli ATM: డబ్బులిచ్చే ఏటీఎం ఓకే.. ఇడ్లీ ఇచ్చే ఏటీఎంను చూశారా..

ఇలా వరుసగా 23 రోజులు చేసింది. చివరకు ఆమెకు కంట్లో నొప్పి రావడం మొదలైంది. భరించలేని నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా… ఆమెను పరీక్షించిన వైద్యులు మహిళ కంట్లో ఏదో ఉన్నట్లు గుర్తించారు. సర్జికల్‌ వస్తువు సాయంతో కంట్లో ఉన్నవి తీయగా.. 23 కాంటాక్ట్‌ లెన్స్‌లు బయటపడ్డాయి. ఇది చూసిన వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Read Also: Axis Bank: యాక్సిస్ బ్యాంకు యూజర్లకు గుడ్ న్యూస్.. డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు

ఈ ఘటనపై వైద్యురాలు కేథరినా కుర్తీవా మాట్లాడుతూ.. ‘‘ నేను ఎంతో జాగ్రత్తగా ఆ కాంటాక్ట్‌ లెన్స్‌లను బయటకు తీశాను. అవి మొత్తం 23 ఉన్నాయి. వాటిని కంటి నుంచి బయటకు తీయటానికి మంచి సర్జికల్‌ వస్తువును వాడాల్సి వచ్చింది. అవి నెల రోజులు కంటి లోపల ఉండిపోవడంతో ఒకదానికి ఒకటి అతుక్కుని ఉన్నాయి’’ అని వివరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version