Site icon NTV Telugu

Delhi Airport: సీపీఆర్‌తో వృద్ధుడిని రక్షించిన వైద్యురాలు.. వీడియో వైరల్

Doctor

Doctor

Delhi Airport: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 2 వద్ద గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా కుప్పకూలిన ఓ వృద్ధుడిని ఒక వైద్యురాలు కాపాడారు. కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిన సెకన్ల వ్యవధిలో స్పందించి సీపీఆర్‌ చేసి ఆయన ప్రాణాలను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 60 ఏళ్ల వ్యక్తి ఎయిర్‌పోర్టులోని ఫుడ్‌ కోర్టు ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే ఆ ప్రాంతంలో జనం గుమిగూడారు. అత్యవసర సమయంలో వెంటనే స్పందించిన మహిళా డాక్టర్‌.. సీపీఆర్ నిర్వహించి నిమిషాల వ్యవధిలోనే ఆ వ్యక్తిని కాపాడారు. ఆ వ్యక్తి స్పృహలోకి వచ్చేవరకు డాక్టర్‌ అలసిపోకుండా సీపీఆర్‌ చేస్తుండగా.. ఈ వీడియోను చిత్రీకరించారు. ఓ వ్యక్తి ప్రాణాలు రక్షించారంటూ ఆ మహిళా డాక్టర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. భారతీయ వైద్యులంటే చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.

Exit mobile version