NTV Telugu Site icon

Online Fraud: గేమింగ్‌లో లాభలు అంటూ డాక్టర్‭కు రూ.89 లక్షలు మోసం చేసిన సైబర్ నేరగాళ్లు..

Online

Online

Online Fraud: చ్చత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయ్‌పూర్ జిల్లాలో ఓ వైద్యుడు ఆన్‌లైన్‌లో సుమారు రూ.89 లక్షల మోసానికి గురి అయ్యాడు. మొదట గేమింగ్ కంపెనీలో పెట్టుబడి పెడితే 40 శాతం లాభం ఇస్తానని నిందితుడు హామీ ఇచ్చాడు. ఆ తర్వాత దుండగులు రూ.88 లక్షల 75 వేలు డాక్టర్ నుండి దోపిడీ చేశారు. నిందితులు దాదాపు 40కి పైగా వాయిదాల్లో వైద్యుడి నుంచి డబ్బులు తీసుకుని ఆ తర్వాత అసలు ఆ సొమ్ము కూడా తిరిగి ఇవ్వలేదు. దింతో ఖమ్‌హర్దిహ్ పోలీస్ స్టేషన్‌లో నిందితుల దుండగులపై డాక్టర్ ఫిర్యాదు చేశారు డాక్టర్.

Vivo T3 Ultra: అదిరిపోయే ఫీచర్లతో కొత్త మొబైల్‭ను తీసుకరాబోతున్న వివో..

ఖమ్‌హర్దిహ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నరేంద్ర మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.., టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా నిందితులను సంప్రదించినట్లు డాక్టర్ అషిత్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్ రాయల్ గేమింగ్ కంపెనీలో డబ్బు పెట్టుబడి పెట్టి భారీ లాభాలు ఇస్తానని నిందితుడు హామీ ఇచ్చాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ నిందితులు అతడికి ఎరగా చూపడంతో వైద్యుడు ఆ డబ్బును అతడు పేర్కొన్న ఖాతాలకు బదిలీ చేశాడు. సమయం పూర్తయిన తర్వాత, డాక్టర్ డబ్బు అడగడంతో నిందితుడు మరింత పెట్టుబడి పెట్టమని అడిగాడు. వైద్యుడు నిందితుడి మాట వినకపోవడంతో, నిందితుడు అతని కాల్స్ తీయడం మానేశాడు.

Show comments