NTV Telugu Site icon

Case on Chicken : కోడి పై కేసుపెట్టిన మోడీ.. దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

Chicken

Chicken

Case on Chicken : పెరుగుతున్న టెక్నాలజీ పుణ్యమాని మనం సెల్ ఫోన్లో అలారాలు పెట్టుకుని నిద్రలేస్తున్నాం. కానీ పూర్వం కోడి కూతే అలారం. కోడిపుంజు కూసిందంటే నిద్రలేచి ఎవరి పనులు వారు చూసుకునే వారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కోడిపుంజుకూతే అలారం. అలాంటిది కోడి కూసిందని ఓ డాక్టర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. అలోక్ మోడీ అనే వ్యక్తి పాలసియా ప్రాంతంలోని గ్రేటర్ కైలాశ్ ఆస్పత్రి సమీపంలో సిల్వర్ ఎన్‌క్లేవ్స్‌లో జీవిస్తున్నారు. అలోక్ మోడీ ఓ కేన్సర్ డాక్టర్. రోజంతా డ్యూటీ, ఆపరేషన్లు చేసి అర్ధరాత్రి ఇంటికి వస్తాడు. పొద్దుట వరకు నిద్ర లేవ లేడు. అయితే తన ఇంటి దగ్గర ఉన్న వందన విజయన్ అనే వ్యక్తి పెంచుకుంటున్న కోడి పుంజు తెల్లవారుజామునే కూస్తూ మోడీ నిద్రకు ఆటంకం కలిగించేది.

Read Also: Late Train Grand WelCome: 9గంటలు లేటుగా వచ్చిన రైలుకు గ్రాండ్ గా వెల్కమ్

దాంతో మోడీకి విపరీతమైన కోపం వచ్చేది. ఈ విషయమై విజయన్ తో రెండు మూడు సార్లు ప్రస్తావించి కోడి కూయకుండా చర్యలు తీసుకోమన్నాడు అలోక్. దాంతో ఆ కోడిని బోనులో పెట్టి ఉంచమని విజయన్‌కు సలహా ఇచ్చాడు. కానీ అది అతని వల్ల కాలేదు. దీంతో ఆ కోడి ఉదయం పూట కూస్తూనే ఉంది. దాంతో విసిగిపోయిన మోడీ.. చేసేదేం లేక పాలసియా పోలీసులను ఆశ్రయించాడు. తన నిద్రకు భంగం కలిగిస్తోందని కోడి మీద కంప్లైంట్ ఇచ్చాడు. రోజంతా ఆస్పత్రిలో డ్యూటీ చేసి అలసిపోయి రాత్రి ఇంటికొచ్చి పడుకుంటానని, అయితే తన ఇంటికి సమీపంలో ఉన్నందున విజయన్‌కు చెందిన కోడి రోజూ తెల్లవారుజామున నాలుగు, ఐదు గంటల మధ్య కూస్తూ తన నిద్రకు భంగం కలిగిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఆ కంప్లైంట్‌ని పోలీసులకు స్వీకరించారు. అంతేకాదు కోడి యజమాని వందన విజయన్‌పై సెక్షన్‌ 138 కింద కేసు పెట్టారు.