NTV Telugu Site icon

Shankar-Rahman: భారతీయుడు-2 నుండి రెహమాన్‌ను ఎందుకు తప్పించారు?

Ar Rahman

Ar Rahman

కొందరి దర్శకులకు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్‌లు ఉంటారు. ఉదాహరణకు S.S రాజమౌళి – M.M కీరవాణి, జక్కన్న ప్రతీ చిత్రానికి కీరవాణినే సంగీతం అందిస్తాడు. రాజమౌళి సినిమాకు బయట మ్యూజిక్ డైరెక్టర్ ను ఊహించలేం. వారిలాగే శంకర్ – ఏ. ఆర్. రెహమాన్ లది కూడా బ్లాక్ బస్టర్ కాంబినేషన్. శంకర్ – ఏ. ఆర్. రెహమాన్ ల కలయికలో వచ్చిన ప్రతీ సినిమా మ్యూజికల్ గా సూపర్ హిట్టే. భారతీయుడు, శివాజీ, బోయ్స్, రోబో, ప్రేమికుడు, జీన్స్ ఎంత సూపర్ హిట్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

దాదాపు శంకర్ ప్రతీ సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తాడు. రెహమాన్ అందుబాటులో లేనిపక్షంలో హరీస్ జయరాజ్ ను రిపీట్ చేస్తాడు శంకర్. అపరిచితుడు, స్నేహితుడు చిత్రాలకు హారిస్ జయరాజే మ్యూజిక్ ఇచ్చాడు. కాగా శంకర్, ఏ.ఆర్ రెహమాన్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఆ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘పచ్చని చిలకలు తోడుంటే’ లాంటి సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్ట్ టాప్ లో తప్పకుండా ఉంటాయి.

Also Read: MS Dhoni Birthday: గోల్డెన్ డకౌట్‌తో మొదలై.. సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా! అదొక్కటి మాత్రం వెలితి

దాదాపు 27 ఏళ్ల తర్వాత భారతీయుడుకు సీక్వెల్ తెరకెక్కించాడు శంకర్. వీరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఇండియన్ – 2 కు ఏ. ఆర్ రెహమాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోలేదు శంకర్. ఇది సినీ వర్గాలను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతటి ప్రెస్టీజియస్ చిత్రానికి రెహమాన్ ను తీసుకోకవపోడానికి గల కారణం ఏమై ఉంటుందని చిత్ర వర్గాలు చర్చించుకుంటున్నాయి. శంకర్, రెహమాన్ లకు పోసగడం లేదని కూడా వార్తలు వచ్చాయి. కానీ భారతీయుడు – 2 చిత్రాన్ని మొదలుపెట్టే సమయంలో రెహమాన్ రోబో 2.O రీ- రికార్డింగ్ పనుల్లో బిజీ గా ఉన్నాడు. ఆ సమయంలో ఇండియన్ – 2కు సాంగ్స్ చేయమని చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. ఇండియన్ -2కు యువన్, హారిస్ జైరాజ్ ను తీసుకుందామని అనుకున్నాం, అదే టైమ్ లో అనిరుధ్ నుండి ఇటీవల వచ్చిన సాంగ్స్ నచ్చడంతో ఈ చిత్రానికి అనిరుధ్ ను తీసుకున్నామని శంకర్ తెలిపారు.