Site icon NTV Telugu

Modi-Zelenskyy: మోడీ- జెలెన్స్కీ పక్కనున్న మహిళ ఎవరో తెలుసా?.. ఎందుకు అంత దగ్గరగా ఉంది?

Pm Modi

Pm Modi

ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్నారు. పోలాండ్ నుంచి నేరుగా రైలులో శుక్రవారం ఉదయం కీవ్ చేరుకున్నారు. కీవ్‌కు చేరుకున్న ఆయనకు భారతీయ కమ్యూనిటీ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీనితో కలిసి నేషనల్ మ్యూజియంకు ప్రధాని మోడీ చేరుకున్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో మరణించిన పిల్లలకు, నైనికులకు ఇద్దరు నాయకులు నివాళులర్పించారు.

READ MORE:CM Chandrababu: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ .. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు

కాగా.. ప్రధాని మోడీ, అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య జరిగిన భేటీకి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో వీరిద్దరితో పాటు ఓ మహిళ కూడా కనిపించింది. ఈ మహిళ ఎవరని చాలా మందికి సందేహం కలగొచ్చు. ఆమె గురించి పూర్తిగా తెలుసుకుందాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో కలిసి కనిపించిన మహిళను అనువాదం కోసం నియమించారు. ప్రధాని మోడీ తన ప్రసంగాలను ఎక్కువగా హిందీలోనే చేస్తారు. చాలా ప్రోగ్రామ్‌లలో ఇంగ్లీష్ మాట్లాడటం కూడా చూశాం. కానీ యాసలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే విదేశీ కార్యక్రమాల్లో ప్రధాని మోడీకి, ఇతర విదేశీ అతిథులకు ఇంటర్‌ప్రెటర్ సౌకర్యాలు కల్పిస్తారు.

READ MORE:Allu Arjun: మెగాస్టార్ లేకపోతే మీరంతా ఎక్కడ ? అల్లు అర్జున్ పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

ఆమె మోడీ మాట్లాడే సంభాషణను అనువదిస్తుంది. అదే సమయంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడిన వాటిలో మోడీకి అర్థమయ్యేలా హిందీలో అనువాదం చేస్తుంది. ప్రస్తుతం మోడీ- ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య భేటీ కొనసాగుతోంది. వీరు మాట్లాడుకునే మాటలను ఈ మహిళ అనువాదం చేయడంతో పాటు వాటిని రాస్తుంటారు కూడా. అందుకే ఆమెను వ్యాఖ్యాత అని పిలుస్తారు. రెండు దేశాల మంత్రుల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం ఆమె పని. దీంతో… వైరల్ అయిన వీడియోలో ఆమె ఇరు నేతలకు అంతదగ్గరగా ఉండటానికి కారణం వారు మాట్లాడుకున్న సంభాషణను అనువాదం చేయడం కోసమని మనకు అర్థమవుతుంది.

Exit mobile version