ఇండియాలో అత్యంత ధనవంతులైన క్రికెటర్స్ ఎవరు అని అడిగితే ముందుగా ధోని, సచిన్, విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్ల పేర్లు వినిపిస్తాయి. విరాట్ కోహ్లి తన నికర విలువ రూ. 1,000 కోట్లు దాటిందని ఇటీవల వార్తలొచ్చాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నికర విలువ రూ. 1,250 కోట్లు, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నికర విలువ రూ. 1,040గా అంచనా వేయబడింది. అయితే వీరందరిని మించి ఆస్తులున్నాయని ఓ క్రెకెటర్ పేరు వినపడుతుంది. అయితే అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. కేవలం రంజీ క్రికెట్ లోనే ఆడాడు. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా..?
Railways: రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త.. ట్రైన్ టికెట్ ధరలు 25 శాతం వరకు తగ్గింపు!
గుజరాత్‌లోని బరోడాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ సమర్‌జిత్ రంజిత్‌సిన్హ్ గైక్వాడ్. ఈయన ఆస్తి విలువ సుమారు రూ.20,000 కోట్లకు పైమాటే. రంజిత్‌సిన్హ్ గైక్వాడ్‌కు ఇంత ఆస్తి ఉండటానికి కారణం అతని కుటుంబ నేపథ్యమే. అతను రాజవంశానికి చెందినవాడు. వడోదర మహారాజు రంజిత్‌సిన్హ్ ప్రతాప్ గైక్వాడ్, శుభన్‌గిని రాజేల ఏకైక కుమారుడే సమర్‌జిత్ రంజిత్‌సిన్హ్ గైక్వాడ్. అతను ఏప్రిల్ 25, 1967న జన్మించాడు. డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్‌లో చదువుకున్నాడు.
Botsa Satyanarayana: బాధ్యతగా మాట్లాడాలి.. రండి బహిరంగ చర్చకు..
2012 మేలో తన తండ్రి మరణం అనంతరం సమర్‌జిత్‌కు మహారాజుగా పట్టాభిషేకం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసమైన లక్ష్మీ విలాస్ ప్యాలెస్, మోతి బాగ్ స్టేడియం, మహారాజా ఫతే సింగ్ మ్యూజియం యజమాని ఇతనే. అంతేకాకుండా లక్ష్మీ విలాస్ ప్యాలెస్ సమీపంలో 600 ఎకరాలకు పైగా రియల్ ఎస్టేట్ భూములు కూడా ఉన్నాయి. గుజరాత్, బెనారస్‌లలో 17దేవాలయాలను, ట్రస్ట్‌లను కూడా నిర్వహిస్తున్నారు. 2002లో వంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని సమర్‌జిత్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. బరోడా తరఫున 1987-89 మధ్య రంజీ ట్రోఫీలో ఆరు మ్యాచ్‌లు ఆడారు. అంతేకాకుండా బరోడా క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగానూ పనిచేశారు.