NTV Telugu Site icon

Raashi Khanna : ఆ విషయంలో షారూఖ్ ఖాన్‎ను దాటేసిన రాశీ ఖన్నా

Rashi Khanna

Rashi Khanna

Raashi Khanna : ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ రాశీ ఖన్నా. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో నటిస్తున్న అందాల భామల్లో రాశీ ఖన్నా ఒకరు. దాదాపు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడలో నటించిన రాశీ ఇప్పుడు బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేస్తోంది. రుద్ర వెబ్ సిరీస్ లలో నెగెటివ్ పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ మధ్య కాలంలో ఫర్జీ తో ప్రేక్షకుల ముందకొచ్చింది. ఆమె ఫర్జీలో తెలివైన బ్యాంక్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకుంది. రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ షో ప్రేక్షకుల నుంచి అమితమైన ఆదరణను దక్కించుకుంది. దీని ఫలితంగా రాశీ ఖన్నాకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) ప్రచురించే పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ జాబితాలో అగ్రస్థానం కైవసం చేసుకుంది రాశీఖన్నా.

Read Also: Shivathmika: ఆ గ్యాప్‎లోనే ‘దొరసాని’కి అర్థమైందంట

ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ సాధించి.. అందరినీ అవాక్కై్య్యేలా చేసింది. ఈ విషయం తెలిసి చాలా సంతోష పడ్డానని రాశీ చెప్పింది. ఈ విషయాన్ని మొదట తాను నమ్మలేదని, నిజమో కాదో తెలుసుకోవడానికి కొంచెం సమయం పట్టిందని తెలిపింది. తన తండ్రికి ఫోన్ చేసి ఈ ఆనందాన్ని పంచుకున్నానని తెలిపింది. ‘ఆయనకు ఐఎండీబీ గురించి ఏం తెలియదు. కానీ, నేను షారుఖ్ ఖాన్‌ కంటే మొదటి స్థానంలో ఉన్నానని చెప్పగానే ఆయన షాక్‌‌కు గురయ్యారు. నా జీవితంలో దీనిని ఓ మైలు రాయిగా భావిస్తాను’ అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. ఫర్జీ వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు పోషించారు. భారతదేశంలోనే ఎక్కువ మంది వీక్షించిన సిరీస్ గా ఫర్జీ రికార్డును నెలకొల్పింది. దాదాపు 3.7 కోట్ల మంది షోను వీక్షించారు అని అంచనా.

Show comments