ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలలో మరోసారి బాలికలు సత్తా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా 2803 పాఠశాలలో విద్యార్థులకు 100% ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 17 స్కూల్స్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఏలూరుకు చెందిన ఆకుల వెంకట నాగసాయి మనస్వి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 600 మార్కులకు 599 మార్కులు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. దీనితో ఆ అమ్మాయి స్టేట్ టాపర్ గా నిలిచింది. ఆకుల వెంకట నాగ సాయి మనస్వికి కేవలం సెకండ్ లాంగ్వేజ్ హిందీలో మాత్రమే 99 మార్కులు రాగా మిగతా ఐదు సబ్జెక్టులలో 100కి 100 మార్కులు సాధించి స్టేట్ పేపర్ గా నిలిచింది.
Read Also: Gilli Re- Release : కళ్లు చెదిరే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విజయ్ “గిల్లి” మూవీ..
కాగా.. మనస్వి తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కావడం విశేషం. మనస్వి తండ్రి ఏఎన్వీ ప్రసాద్.. నూజివీడు మండలం అన్నవరం మెయిన్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి శైలజ.. చాట్రాయి మండలం సోమవరం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే.. తాను చదువుకున్న సమయంలో ఎలాంటి అనుమానాలు, సందేహాలున్నా తన తల్లిదండ్రులను అడిగి తెలుసుకునేది. ఇలా.. తమ కూతురుకు అన్ని సందేహాలను తీర్చడంలో తోడ్పడటంతో.. స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చిందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ప్రతి తరగతిలో కష్టపడి చదివేదని.. ఇప్పుడు 10వ తరగతిలో కష్టపడి చదివి స్టేట్ ఫస్ట్ సాధించడం తమకు గర్వకారణంగా ఉందని ప్రసాద్, శైలజ ఆనందం వ్యక్తం చేశారు. ఇక.. భవిష్యత్ లో ఐఐటీలో కంప్యూటర్స్ గ్రాడ్యూయేషన్ చేసి స్థిరపడాలనే లక్ష్యంతో ఉన్నట్లు మనస్వి తెలిపింది. తన విజయంలో తన పేరెంట్స్ది కూడా ముఖ్య పాత్ర అని మనస్వి తెలిపింది.
Read Also: Yogi Adityanath: కాంగ్రెస్ గెలిస్తే ముస్లిం చట్టం తెస్తారు.. సీఎం సంచలన వ్యాఖ్యలు