Bank FD: సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకులేవో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఏడాదిలోపు టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు మే 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. సాధారణంగా సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంటాయి. ఈ క్రమంలో ఎస్బీఐ సహా 7.85 శాతం వరకు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్న 5 బ్యాంకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
READ MORE: Ebrahim raisi: హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ దుర్మరణం.. ఒకరోజు సంతాప దినం ప్రకటించిన భారత్
Also Read
- IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
- Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
ఎస్బీఐ ఎఫ్డీ రేట్లు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 46 రోజుల నుంచి 179 రోజుల టెన్యూర్ పై 75 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్లు పెట్టింది. సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం ఉన్న వడ్డీని 6 శాతానికి పెంచింది. అలాగే 180 రోజుల నుంచి 210 రోజుల టెన్యూర్ పై 25 బేసిస్ పాయింట్లు పెంచింది. సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక 211 రోజుల నుంచి ఏడాది టెన్యూర్లపై 25 బేసిస్ పాయింట్లు పెంటి 6.75 శాతం వడ్డీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీ ఇస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్లపై 3.50 శాతం నుంచి 7.75 శాతం మేర వడ్డీ ఇస్తోంది. గరిష్ఠంగా 15 నెలల నుంచి 2 ఏళ్లలోపు ఉండే డిపాజిట్లపై 7.75 శాతం మేర వడ్డీ అందిస్తోంది. కొత్త రేట్లు ఫిబ్రవరి 17, 2024 నుంచే అమలులోకి తీసుకొచ్చింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎఫ్డీ రేట్లు: రూ.2 కోట్లలోపు ఉండే డిపాజిట్లపై 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్లపై 3.50 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేటు ఇస్తోంది. గరిష్ఠంగా 18 నెలల నుంచి 21 నెలలలోపు ఉండే టెన్యూర్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం ఆఫర్ చేస్తోంది.
కెనరా బ్యాంక్: ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తోంది. గరిష్ఠ వడ్డీ రేటు చూసుకుంటే 444 రోజుల స్పెషల్ స్కీమ్ పై 7.75 శాతం మేర వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. కొత్త రేట్లు ఫిబ్రవరి 19, 2024 నుంచే అందుబాటులోకి తెచ్చింది.
యాక్సిస్ బ్యాంక్: ఈ ప్రైవేట్ బ్యాంకులో 7- 10 ఏళ్ల టెన్యూర్లపై 3.50 శాతం నుంచి 7.75 శాతం వరకు సీనియర్లకు వడ్డీ రేట్లు ఇస్తోంది. గరిష్ఠంగా 17 నెలల నుంచి 18 నెలలలోపు టెన్యూర్ డిపాజిట్లపై 7.85 శాతం మేర వడ్డీ రేట్లు కల్పిస్తోంది. కొత్త రేట్లు మే 13, 2024 నుంచే అమలులోకి తెచ్చింది.
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!