NTV Telugu Site icon

Bank FD: సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకులేవో తెలుసా?

New Project (40)

New Project (40)

బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఏడాదిలోపు టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు మే 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. సాధారణంగా సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంటాయి. ఈ క్రమంలో ఎస్‌బీఐ సహా 7.85 శాతం వరకు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్న 5 బ్యాంకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

READ MORE: Ebrahim raisi: హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ దుర్మరణం.. ఒకరోజు సంతాప దినం ప్రకటించిన భారత్

ఎస్‌బీఐ ఎఫ్‌డీ రేట్లు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 46 రోజుల నుంచి 179 రోజుల టెన్యూర్ పై 75 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్లు పెట్టింది. సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం ఉన్న వడ్డీని 6 శాతానికి పెంచింది. అలాగే 180 రోజుల నుంచి 210 రోజుల టెన్యూర్ పై 25 బేసిస్ పాయింట్లు పెంచింది. సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక 211 రోజుల నుంచి ఏడాది టెన్యూర్లపై 25 బేసిస్ పాయింట్లు పెంటి 6.75 శాతం వడ్డీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీ ఇస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్లపై 3.50 శాతం నుంచి 7.75 శాతం మేర వడ్డీ ఇస్తోంది. గరిష్ఠంగా 15 నెలల నుంచి 2 ఏళ్లలోపు ఉండే డిపాజిట్లపై 7.75 శాతం మేర వడ్డీ అందిస్తోంది. కొత్త రేట్లు ఫిబ్రవరి 17, 2024 నుంచే అమలులోకి తీసుకొచ్చింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు: రూ.2 కోట్లలోపు ఉండే డిపాజిట్లపై 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్లపై 3.50 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేటు ఇస్తోంది. గరిష్ఠంగా 18 నెలల నుంచి 21 నెలలలోపు ఉండే టెన్యూర్లపై సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం ఆఫర్ చేస్తోంది.

కెనరా బ్యాంక్: ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తోంది. గరిష్ఠ వడ్డీ రేటు చూసుకుంటే 444 రోజుల స్పెషల్ స్కీమ్ పై 7.75 శాతం మేర వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. కొత్త రేట్లు ఫిబ్రవరి 19, 2024 నుంచే అందుబాటులోకి తెచ్చింది.
యాక్సిస్ బ్యాంక్: ఈ ప్రైవేట్ బ్యాంకులో 7- 10 ఏళ్ల టెన్యూర్లపై 3.50 శాతం నుంచి 7.75 శాతం వరకు సీనియర్లకు వడ్డీ రేట్లు ఇస్తోంది. గరిష్ఠంగా 17 నెలల నుంచి 18 నెలలలోపు టెన్యూర్ డిపాజిట్లపై 7.85 శాతం మేర వడ్డీ రేట్లు కల్పిస్తోంది. కొత్త రేట్లు మే 13, 2024 నుంచే అమలులోకి తెచ్చింది.