NTV Telugu Site icon

Calcium: శరీరంలో క్యాల్షియం స్థాయి తగ్గితే ఏమౌతుందో తెలుసా..?

Calcium10

Calcium10

కాల్షియం మన శరీరానికి అవసరమైన కీలక పోషకం. అది లోపిస్తే చాలా రకాల వ్యాధులు సంక్రమిస్తాయి. ముఖ్యంగా మన శరీరంలో ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం ఉండాల్సిందే. ఒక వేళ క్యాల్షియం లోపిస్తే.. మన శరీరంలో కొన్ని రకాల లక్షణాల కనిపిస్తాయి. అప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇంతకు మనకు క్యాల్షియం ఎందుకు అవసరమో తెలుసా.. ఎముకలు బలంగా ఉండాలన్నా, దంతాలు దృఢంగా ఉండాలన్నా, గుండెతో సహా కండరాల సంకోచాలను నియంత్రించాలన్నా, నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలన్నా.. క్యాల్షియం అవసరం పడుతుంది. హార్మోన్ల ఉత్పత్తిలో, కణాల సిగ్నలింగ్ వ్యవస్థలో, ఎంజైముల పనితీరులో క్యాల్షియం పాత్ర ముఖ్యమైనది.

READ MORE: Anna Rambabu: సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ జగనన్నే రావాలి..

మన శరీరంలో ఎప్పుడైతే కాల్షియం తగ్గుతుందో.. అది కొన్ని సంకేతాల ద్వారా ఆ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అప్పుడు వైద్యులను సంప్రదించి ప్రతిరోజూ క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవడం చాలా అవసరం. క్యాల్షియం సరిగ్గా లేకుంటే కండరాలు సరిగ్గా పనిచేయలేవు. కండరాల్లో తిమ్మిరి పట్టడం అధికమవుతుంది. నీరసంగా అనిపిస్తుంది. కాళ్లు, పాదాలు, చేతుల్లోని కండరాలలో తిమ్మిరిగా అనిపించవచ్చు. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. శరీరం జలదరించినట్టు అనిపిస్తుంది. వేలి గోళ్లు కూడా మన ఆరోగ్యాన్ని సూచిస్తాయి. శరీరంలో తగినంత కాల్షియం లేకపోతే గోళ్లు పెళుసుగా మారిపోతాయి. గోళ్ల చివర్లు విరిగిపోతూ, చీలిపోతూ ఉంటాయి. క్యాల్షియం అనేది దంతాల ఎనామెల్‌లో ముఖ్యమైన భాగం. ఇది దంతాల పై పొరను రక్షిస్తూ ఉంటుంది. దీర్ఘకాలికంగా కాల్షియం లోపిస్తే ఎముక బలహీనంగా మారుతుంది. దీనివల్ల ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రావచ్చు.

గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించే విద్యుత్ ప్రేరణలను నియంత్రించే శక్తి క్యాల్షియంకి ఉంది. క్యాల్షియం స్థాయి తక్కువగా ఉన్నప్పుడు గుండె లయలో అంతరాయాలు ఏర్పడతాయి. పాలు, పెరుగు, చీజ్ వంటివి తింటే శరీరంలో క్యాల్షియం శాతం పెరుగుతుంది. పాలకూర, కాలే వంటి ఆకుకూరలను తరచూ తింటూ ఉండాలి. బాదం పప్పులు, సోయా పాలు, సోయా ఉత్పత్తులు, టోపు, పనీర్ వంటివి తినాలి. అలాగే సాల్మన్, సార్డినెస్ వంటి చేపలు కూడా తింటూ ఉండాలి. చియా గింజలు, నువ్వులు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవన్నీ కూడా కాల్షియన్ని శరీరానికి అందిస్తాయి.

Show comments