NTV Telugu Site icon

Green Onion: ఉల్లి ఆకులతో ఆరోగ్యానికి ఎంతో మేలు తెలుసా..! ముఖ్యంగా దానికి..

Onion

Onion

మనం రోజు తినే కూరల్లో ఉల్లిగడ్డను వేసి వండుకోవడం అది కామనే.. ఉల్లిపాయ లేనిదే వంట పూర్తి కాదు. నిజానికి ఉల్లిపాయ అనేది మన ఆహారపు అలవాట్ల నుంచి విడదీయరాని ఒక పోషకాలా నిధి. కానీ ఉల్లిగడ్డ కంటే దాని ఆకులు తినడం వల్ల కూడా చాలా మంచిదని చెబుతున్నారు. ఉల్లి ఆకులతో ఆరోగ్యానికి సంబంధించి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకులను ఏ వంటకాల్లో వేసి వండినా.. రుచిగా ఉంటుంది. అయితే ఉల్లి ఆకులు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని ఎవరైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఉల్లి ఆకులు హృద్రోగులకు, వృద్ధులకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా.. ఇందులో గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. ఉల్లి ఆకులను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఉల్లి ఆకులు తినడం వల్ల ఏఏ లాభాలున్నాయో తెలుసుకుందాం.

Ganesh Festival: వినాయకుడికి రూ.1.51 కోట్ల నోట్లతో అలంకరణ.. అద్భుతం

ఉల్లి ఆకులు తినడం వల్ల ఆరోగ్య లాభాలు:
ఉల్లి ఆకులలో ఉండే క్వెర్సెటిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, ఇతర పోషకాలు ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఉల్లి ఆకుల వినియోగం రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా వీటిలో అధిక మొత్తంలో సల్ఫర్ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. ఉల్లిఆకులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కనిపిస్తాయి.. ఇవి వాపును తగ్గిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ధమనులు ఫ్లెక్సిబుల్‌ గా ఆరోగ్యంగా ఉంటాయి.

Rain Alert: హైదరాబాద్ కు వర్ష సూచన.. సాయంత్రం భారీ వాన

ఉల్లి ఆకులు ఎలా ఉపయోగించవచ్చంటే:
ఉల్లిఆకులను సన్నగా కట్ చేసి సలాడ్‌లో జోడించండి. దీనికి టొమాటో, దోసకాయ, నిమ్మరసం కలపండి. అంతేకాకుండా శాండ్‌విచ్‌లో కూడా వాడుతారు. బ్రెడ్‌పై పచ్చి ఉల్లిపాయలు, టొమాటో, ఇతర కూరగాయలను కలిపి శాండ్‌విచ్ చేసుకోవచ్చు. ఉల్లిఆకులను చట్నీలో కూడా వాడవచ్చు. వాటిని సన్నగా తరిగి చట్నీలో కలపాలి. ఉల్లిఆకులను తక్కువ నూనెలో వేయించి కూడా తినవచ్చు. వీటిని ఇతర కూరగాయలతో సూప్ తయారు చేసి తాగవచ్చు. అంతేకాకుండా.. ఉల్లిఆకులు రసం చేసుకుని తాగితే చాలా మంచిది.