NTV Telugu Site icon

Prashanth Neel: నీలకంఠాపురం దేవస్థానాన్ని సందర్శించిన కేజీఎఫ్ ఫేం డైరెక్టర్ ప్రశాంత్ నీల్

New Project (29)

New Project (29)

Prashanth Neel: కేజీఎఫ్‌ చిత్రంతో ఒక్కసారిగా దేశం దృష్టి అంతా తనవైపు మరల్చుకున్న సెన్సేషనల్ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. బాహుబలి సిరీస్ తర్వాత దక్షిణాది సినిమాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది ఈ కేజీఎఫ్ సినిమా. దీంతో ప్రశాంత్‌ నీల్‌ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. దేశం దృష్టిని ఆకర్షించిన ఈ కన్నడ స్టార్‌ డైరెక్టర్‌ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ అని చాలా మందికి తెలియదు. అవును ప్రశాంత్ నీల్ స్వస్థలం ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా నీలకంఠాపురం. తన పూర్తి పేరు ప్రశాంత్‌ నీలకంఠాపురం. అంతేకాదు కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ రఘువీరా రెడ్డి ప్రశాంత్‌ నీల్‌కు స్వయాన చిన్నాన్న అవుతాడు.

ప్రశాంత్ నీల్ నీలకంఠాపురంలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, నీలకంఠాపురం గ్రామంలోని తన చిన్న నాటి గుర్తులను స్మరణకు తెచ్చుకున్నారు. ప్రశాంత్‌ నీల్‌ను చూసేందుకు నీలకంఠాపురం గ్రామస్తులతోపాటు కర్నాటక సరిహద్దు గ్రామాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సందర్భంగా ప్రశాంత్‌ నీల్‌ గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘సినిమాల్లో ఎంత గొప్పవాడినైనా.. మరణానంతరం నీలకంఠాపురంలోని మా నాన్న సమాధి పక్కనే నా సమాధి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్‌ సినిమా షూటింగ్‌ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇంకా ఎన్టీఆర్ తో కలిసి దేవర మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి కూతురు జాన్వీ తెలుగు తెరకు పరిచయం అవుతోంది.