టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మహేష్ బాబు 28 వ చిత్రం గా తెరకెక్కుతోంది.ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన దమ్ మసాలా లిరికల్ వీడియో సాంగ్‌తోపాటు సెకండ్ సింగిల్ ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేస్తోంది. కాగా ఇప్పుడు గుంటూరు కారం ట్రైలర్ ఎప్పుడనే దానిపై ఓ అప్‌డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.తాజాగా వస్తున్న న్యూస్ ప్రకారం గుంటూరు కారం థ్రియేట్రికల్ ట్రైలర్‌ను 2024 జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లాంఛ్ చేయబోతున్నారని సమాచారం.. అయితే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గుంటూరు కారం మూవీలో క్రేజీ బ్యూటీ శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా కనిపించనుంది. ఈ మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
గుంటూరు కారం చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.. గుంటూరు కారం 2024 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన విడుదల చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్ తో మహేష్ అభిమానులు కోరుకుంటున్న అన్ని ఎలిమెంట్స్ సినిమాలో అందించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది. అయితే మహేష్, త్రివిక్రమ్ కాంబో లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు తెరకెక్కాయి. అతడు సినిమా మంచి విజయం సాధించగా.. ఖలేజా సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దీనితో మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్నా మూడో మూవీ గుంటూరు కారం సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి.